Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ కోసం స్టార్‌ హంట్‌

By:  Tupaki Desk   |   22 April 2019 10:06 AM GMT
కేజీఎఫ్‌ కోసం స్టార్‌ హంట్‌
X
సౌత్‌ లో బాహుబలి తర్వాత అంతటి విజయాన్ని దక్కించుకున్న చిత్రంగా 'కేజీఎఫ్‌' నిలిచింది. సౌత్‌ తో పాటు ఉత్తరాదిన కూడా కేజీఎఫ్‌ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని ఏరియాల్లో కలిపి రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు చేసిన కేజీఎఫ్‌ కన్నడ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డును నమోదు చేయడం జరిగింది. కేజీఎఫ్‌ చిత్రంను ఒక అద్బుతంగా సినీ ప్రముఖులు కూడా అభినందించారు. అలాంటి కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 అదే రెండవ పార్ట్‌ కు రంగం సిద్దం అయ్యింది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్‌ కు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

కేజీఎఫ్‌ 2 కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు స్టార్‌ హంట్‌ నిర్వహిస్తున్నారు. 8 నుండి 16 ఏళ్ల అబ్బాయిలు మరియు 25 ఏళ్లు పై బడిన వారి కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు వెదుకుతున్నారు. ఏప్రిల్‌ 26వ తారీకున బెంగళూరులో ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు ఆడిషన్స్‌ నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. ఆడిషన్స్‌ వచ్చే వారు ఏదైనా ఒక నిమిషం డైలాగ్‌ ను ప్రాక్టీస్‌ చేసి రావాల్సిందిగా ప్రకటనలో సూచించడం జరిగింది.

మొదటి పార్ట్‌ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రెండవ పార్ట్‌ ను అంతకు మించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. రెండవ పార్ట్‌ తో బాలీవుడ్‌ పై ఎక్కువ దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో ప్రముఖ బాలీవుడ్‌ స్టార్స్‌ ను ఈ చిత్రంలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో కొత్త వారిని ఎంపిక చేసేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటన ఇవ్వడం సినిమాపై మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేజీఎఫ్‌ 2 చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.