స్టార్ హీరో భార్య రాక్షసి

Thu Mar 14 2019 11:54:58 GMT+0530 (IST)

తెలుగు తమిళంలో దశాబ్దం క్రితం స్టార్ డం దక్కించుకున్న జ్యోతిక హీరోయిన్ గా మంచి ఫేం ఉన్న సమయంలోనే హీరో సూర్యను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత పిల్లలు వారి ఆలన పాలన కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. పిల్లలు కాస్త పెద్ద వారు అయ్యి స్కూల్ కు వెళ్తున్న నేపథ్యంలో జ్యోతిక కొన్నాళ్ల క్రితం రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. జ్యోతిక రీ ఎంట్రీతో సూపర్ హిట్ అయ్యింది. చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను దక్కించుకున్నాయి.ప్రస్తుతం జ్యోతిక కొత్త దర్శకుడు రాజ్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తోంది. ఆ చిత్రంలో జ్యోతిక పాఠశాల ఉపాధ్యాయురాలి పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రంలో తమిళ ప్రముఖ నటీనటులు అయిన సత్యరాజ్ పేరడీ హరీష్ పూర్ణిమ వంటి వారు నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం చెన్నై శివారు ప్రాంతంలో 50 లక్షలు ఖర్చు చేసి ఒక పాఠశాల సెట్టింగ్ ను నిర్మించారు. షూటింగ్ ఎక్కువ శాతం అక్కడే నిర్వహించారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సమ్మర్ చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు రాజ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక వైపు షూటింగ్ పూర్తి చేసే పనితో పాటు మరో వైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు.

ఈ సమయంలోనే చిత్రానికి టైటిల్ ను ఖరారు చేసే పనిలో కూడా యూనిట్ సభ్యులు పడ్డట్లుగా తెలుస్తోంది. తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 'రాక్షసి' అనే టైటిల్ ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఆ టైటిల్ తోనే విడుదల చేయాలని భావిస్తున్నారట. ఆమద్య వచ్చిన రాక్షసన్ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రాక్షసి సినిమా టైటిల్ సెంటిమెంట్ పరంగా కూడా కలిసి వస్తుందేమో అని వారు భావిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే రాక్షసి టైటిల్ ను ఖరారు చేసే యోచనలో ఉన్నారు. కొన్ని రోజుల్లో టైటిల్ విషయంలో క్లారిటీ ఇవ్వనున్నారు.

ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన తర్వాత కళ్యాణ్ దర్శకత్వంలో భర్త సూర్య నిర్మించబోతున్న చిత్రంలో నటించబోతుంది. ఆ చిత్రంలో సూర్య తమ్ముడు కార్తీ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ చిత్రం కూడా ఇదే ఏడాది వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.