బాయ్ ఫ్రెండ్ తో స్టార్ హీరోయిన్ రొమాంటిక్ వెకేషన్

Tue Jun 11 2019 13:00:56 GMT+0530 (IST)

సౌత్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో నయనతార ఒకరు. నిజానికి వారందరిలో కూడా టాప్ నయన్.  అందుకే నయన్ ను లేడీ సూపర్ స్టార్ అంటున్నారు. ప్రొఫెషనల్ గా ఎప్పుడూ తన సినిమాలతో వార్తల్లో ఉండే నయన పర్సనల్ లైఫ్ విషయంలో కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. పాతకాలంలో జరిగిన లవ్ స్టొరీలు ఇప్పుడెందుకు కానీ ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో ఉంది. నయన్ ఆ విషయాన్ని పైకి ఓపెన్ గా చెప్పదు కానీ ఇద్దరూ లవ్ లో ఉన్న విషయాన్ని ఎప్పుడూ ఏదో ఒక హింట్ ఇచ్చి మరీ ఇండైరెక్ట్ గా కన్ఫాం చేస్తూ ఉంటుంది.అసలు వారు లవర్స్ కాదు.. భార్యాభర్తలని వాదించే వారు కూడా లేకపోలేదు.  వాళ్ళిద్దరికీ ఎప్పుడో రహస్యంగా వివాహం జరిగిందని.. నయన్ కెరీర్ పీక్స్ లో ఉంది కాబట్టి ఆ విషయాన్ని దాచిపెడుతున్నారని కూడా కోలీవుడ్ లో చాలా రోజుల నుండి టాక్ ఉంది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం నయన్-విఘ్నేశ్ జోడీ రొమాంటిక్ వెకేషన్ లో ఉన్నారు.  గ్రీస్ దేశంలో ప్రస్తుతంవారి ప్రేమ యాత్ర కొనసాగుతోంది.  ఈ విషయాన్ని  నయనతార స్వయంగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకొని మరీ వెల్లడించింది.  గ్రీస్ దేశంలో ఎథెన్స్ నుండి సాంటోరిని కి వెళ్తున్నామని చెప్తూ ఫ్లైట్ టికెట్స్ ఫోటో పెట్టింది. ఇందులో నయన్.. విఘ్నేశ్ ఇద్దరి టికెట్స్ ఉన్నాయి. ఇద్దరి టికెట్స్ కు మధ్య ఒక లవ్ సింబల్ కూడా పెట్టింది.

అదే కాకుండా తన సింగిల్ ఫోటోలను కూడా కొన్నిటిని షేర్ చేసింది. ఒక ఫోటోలో నయన్ వైట్ డ్రెస్ లో ఒక గ్లాస్ డోర్ ముందు నిలబడగా ఉండగా విఘ్నేశ్ ఫోటో తీస్తునట్టుగా గ్లాస్ డోర్ పై విఘ్నేశ్ ప్రతిబింబం కనిపిస్తోంది. ఈ ఫోటోలోనే నయన్ ఎడమ చేతిపై 'పాజిటివిటి' అనే పచ్చబొట్టు కూడా ఉంది. ఇక నయన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 'కొలైయుతిర్ కాలం'.. 'లవ్ యాక్షన్ డ్రామా'.. 'సైరా' చిత్రాల్లో నటిస్తోంది.