Begin typing your search above and press return to search.

US సెక్స్ రాకెట్: స్టార్ హీరోయిన్ భలే ఎస్కేప్

By:  Tupaki Desk   |   22 Jun 2018 1:02 PM GMT
US సెక్స్ రాకెట్: స్టార్ హీరోయిన్ భలే ఎస్కేప్
X
చికాగోలో బయపడ్డ టాలీవుడ్ సెక్స్ రాకెట్ భాగోతం ఇప్పుడు విపరీతమైన సెన్సేషన్. ఈ స్కాండల్ లో బయటపడ్డ తారల పేర్లు.. వీరితో పాటు లీకుల ద్వారా వెల్లడవుతున్న పేర్లు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే.. వీరితో పాటు తరచుగా అమెరికా తిరిగొచ్చే మరో హీరోయిన్ కూడా ఈ రాకెట్ లో ఇరుక్కోవాల్సి ఉందట కానీ.. అనూహ్యంగా తప్పించుకున్న సంగతి గురించి.. ఇప్పుడు టాలీవుడ్ లో తెగ మాట్లాడుకుంటున్నారు.

ఆమె ఒక టాప్ హీరోయిన్. ఇతర దేశాల్లో తిరగడం అంటే ఈమెకు విపరీతమైన సరదా. ఫ్యామిలీతోను.. స్నేహితులతోను ఫారిన్ కంట్రీస్ లో చక్కర్లు కొట్టేస్తూనే ఉంటుంది. ఇలాంటి టూర్స్ లో భాగంగా గతేడాది చికాగో ట్రిప్ వేసింది ఈ బ్యూటీ. ఈ సమయంలో మోదుగమూడి కపుల్ ఈమెతోటి బాగానే డిస్కషన్స్ చేశారట. మంచి అమౌంట్ ఇచ్చి ఈమెను టెంప్ట్ చేసేందుకు ప్రయత్నించారట కూడా. అయితే.. ఆ సమయంలో ఈమెతో పాటు వేరేవాళ్లు ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. ఆ ట్రిప్ లో ఆ స్టార్ హీరోయిన్ తో పాటు పక్కనే వాళ్ల అమ్మ కూడా ఉంది.

స్టార్ హీరోయిన్ కు చికాగోలో ఇచ్చిన హోటల్.. అక్కడి పరిసరాలు.. మోదుగమూడి జంట వ్యవహారం బాగా అనుమానంగా అనిపించడంతో.. వెంటనే ఆ హోటల్ నుంచి ఖాళీ చేయించేసిందట. అంతే కాదు.. వీరితో ఈ హీరోయిన్ కాంటాక్ట్ లోకి రాకుండా అలర్ట్ అయిందట. దగ్గరలో తెలిసిన వారు ఉంటే.. అక్కడకు వెళ్లే నెపంతో వెంటనే షిఫ్ట్ అయిపోయి.. ఆ ట్రిప్ అంతా అక్కడే ఉన్నారట. అలా ఈ స్టార్ హీరోయిన్.. సెక్స్ రాకెట్ లో ఇరుక్కోకుండా వాళ్ల అమ్మే జాగ్రత్త పడిందట. లేకపోతే మాత్రం ఇప్పుడీ స్టార్ భామకు చిక్కులు మామూలుగా ఉండేవి కావని.. అంత తరచుగా ఈ భామ విదేశాలను చుట్టి వస్తుందని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.