Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్లకు బూతు క్లిప్పులు పంపాడా?

By:  Tupaki Desk   |   26 Oct 2016 10:30 PM GMT
స్టార్ హీరోయిన్లకు బూతు క్లిప్పులు పంపాడా?
X
ఎలాగో వెండితెర మీద రొమాన్స్ చేసేస్తాం కాబట్టి.. రియాల్టీలో కూడా అలాగే రొమాన్స్ చేసేద్దాం అనుకుంటారు కొందరు స్టార్ హీరోలు. కొందరు అందులో సక్సెస్ అవ్వొచ్చేమో కాని.. కొందరు మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతుంటారు. ఇంకొందరైతే శాడిస్టుల టైపులో హీరోయిన్లకు బూతు మెసేజ్ లు పంపడం.. నానా రచ్చా చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి యవ్వారం ఒకటి బయటకొచ్చేసింది బాబోయ్.

అతగాడు ఒక స్టార్ హీరో. ఆల్రెడీ పెళ్ళి కూడా అయిపోయింది. అయితే మనోడు మాత్రం స్టార్ హీరోయిన్లతో పనిచేసిన తరువాత.. వారి ఫోన్ నెంబర్లు తీసుకుని నిధానంగా పరిచయం పెంచేసుకుని.. ఏదో చేసేద్దాం అన్ని ప్రయత్నిస్తుంటాడట. ఇప్పుడు అదే ఊపులో ఓ ఇద్దరు స్టార్ హీరోయిన్లకు మాట్టాడితే చాలు పోర్న్ క్లిప్స్ కొన్ని పంపిస్తున్నాడట. ఈ యాంగిల్ ఏదో బాగుంది చూడు అంటూ వెకిలిగా శాడిజం చూపిస్తున్నాడట. అయితే మనోడు వేధించే ఒక స్టార్ హీరోయిన్ కు త్వరలోనే లైఫ్‌ పెద్ద టర్నింగ్ తీసుకోబోతోంది. అందుకే ఆమెను వదిలేసి.. ఇప్పుడు మరో హీరోయిన్ ను టార్గెట్ చేశాడట. కాకపోతే ఈ ముంబయ్ పిల్ల పెద్ద గడుగ్గాయ్. వెంటనే సైబర్ క్రయిమ్ పోలీస్ స్టేషన్లో కేస్ అంటూ హడావుడి చేసేసింది. దానితో మనోడు తన వైఫ్‌ ను పంపించి కాంప్రమైజ్ చేయించాడట.

అయినా ఈ బూతు క్లిప్పులు పంపించడం.. ఇవన్నీ కాస్త అసహ్యంగా లేవు? చక్కగా పెళ్ళయిన తరువాత కూడా ఇలాంటి వేషాలేంటం

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/