Begin typing your search above and press return to search.

హీరోను షూటింగ్స్ లోనూ వదలని వైఫ్

By:  Tupaki Desk   |   13 Dec 2017 5:49 AM GMT
హీరోను షూటింగ్స్ లోనూ వదలని వైఫ్
X
ఆయన ఓ స్టార్ హీరో. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలో ఇతడిపై ట్రేడ్ జనాలకు కూడా ఫుల్లు కాన్ఫిడెన్స్ ఉంది. ఓ పెద్ద కుటుంబం నుంచి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తన స్టైల్ సినిమాలతో వరుస హిట్స్ తో దూసుకుపోతూ స్టార్ రేంజ్ ను అందుకున్నాడు ఈ హీరో.

ప్లే బోయ్ టైపు ఇమేజ్ కూడా సొంతమైన ఈ హీరో భార్య కూడా.. షూటింగ్ లకు హాజరు అవుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ కుటుంబంలో ఇప్పటివరకూ ఏ హీరో భార్య కూడా ఇలా దగ్గరుండి జాగ్రత్తపడడం కనిపించలేదని ఇండస్ట్రీ జనాలు అంటారు. హీరోయిన్లతో ఎఫైర్స్ విషయంలో.. ఆ ఫ్యామిలీలో ఎవరిపైనా ఇప్పటివరకూ ఆరోపణలు లేవు. ఈ స్టార్ హీరోపై కూడా ఇలాంటివేమీ వినిపించలేదు కానీ.. రీసెంట్ గా ఓ సినిమాలో తనతో పాటు యాక్ట్ చేసిన హీరోయిన్ ను తెగ టీజ్ చేశాడట. ఇది ఎంత దూరం వెళ్లిందో తెలియదు కానీ.. ఆ తర్వాత ఈ హీరోగారి భార్య జాగ్రత్త పడుతోందిట.

ప్రస్తుతం ఓ సినిమా సెట్స్ పై ఉండగా.. హైద్రాబాద్ లో షూటింగ్స్ మినహాయించి.. ఔట్ డోర్ షూట్స్ జరిగే ప్రతీ చోటకు ఈ స్టార్ వైఫ్ హాజరు తప్పనిసరిగా కనిపిస్తోందని తెలుస్తోంది. తను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న వ్యక్తి కావడంతో.. ఈ హీరో కూడా ఏమీ చెప్పలేకపోతున్నాడని.. ఆమె రాకను వ్యతిరేకించలేకపోతున్నాడని టాక్.