Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్టర్ కి బాహుబలి ఇబ్బందులు

By:  Tupaki Desk   |   28 April 2017 5:48 AM GMT
స్టార్ డైరెక్టర్ కి బాహుబలి ఇబ్బందులు
X
బాహుబలి మూవీని ముందు రోజు రాత్రి నుంచే ప్రీమియర్స్ గా ప్రదర్శించడంతో.. తెలుగు ఆడియన్స్ కు ఒక పూట ముందుగానే వచ్చేసింది. హైద్రాబాద్ లోని ప్రధానమైన మల్టీప్లెక్స్ లు అన్నిటిలోను ఏప్రిల్ 27 రాత్రే స్పెషల్ షోస్ వేశారు. ఇవన్నీ దాదాపుగా సెలబ్రిటీల కోసం వేసిన ప్రదర్శనలే కాగా.. ఓ స్టార్ డైరెక్టర్ కి టికెట్ల కష్టాలు వచ్చాయట.

ప్రస్తుతం కొన్ని ఫ్లాపులు ఎదుర్కొంటున్నా.. నిజానికి ఈయనో స్టార్ డైరెక్టర్. అలాగని ఈయనకు టికెట్స్ లభించలేదని కాదు. ఒకటి కాదు.. రెండు మూడు థియేటర్లలో బాహుబలి2 ప్రీమియర్ టికెట్స్ ఈయనకు అందాయి.. ప్రసాద్స్.. బిగ్ సినిమాస్ లో టికెట్స్ చేతికి అందగా.. పలు టికెట్స్ ను తనకు తెలిసిన వారికి పంచాడట ఈ దర్శకుడు. డైరెక్టర్ చెప్పినట్లుగా.. మేనేజర్ వీటి పంపకం కూడా పూర్తి చేశాడు. అయితే.. డైరెక్టర్ దగ్గర ఆయన టికెట్ ఉంటుందని భావించిన మేనేజర్.. మొత్తం అన్ని టికెట్స్ పంచేశాడట. చివరకు థియేటర్ దగ్గకు వెళ్లిన తర్వాత కానీ.. తాము సినిమా చూసేందుకు టికెట్స్ లేవనే విషయాన్ని గుర్తించలేదట ఆ దర్శకుడు.

అయితే.. షో టైం కంటే గంట ముందే థియేటర్ కు చేరుకోవడంతో.. సమస్య పరిష్కారానికి అవకాశం లభించింది. ఆ థియేటర్ మేనేజర్ మొత్తానికి 5 వీవీఐపీ టికెట్స్ ను ఏర్పాటు చేసి.. దర్శకుడిని సినిమా చూసేందుకు పంపడంతో.. ఇష్యూ సెటిల్ అయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/