రాయుడు థియేటర్ కు ఓనర్ గా మారిన త్రివిక్రమ్!

Wed Jun 12 2019 13:49:42 GMT+0530 (IST)

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ల రెమ్యూనరేషన్లు భారీగా ఉంటాయనే సంగతి తెలిసిందే.  మరి ఈ సంపాదనను ఎక్కువమంది రియల్ ఎస్టేట్ లోనే పెట్టుబడిగా పెడతారు. కొందరేమో సినిమా నిర్మాణంలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు.  అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయం తీసుకుంటే ఆయన సినిమా నిర్మాణం లో ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ మొదటి నుంచి రియల్ ఎస్టేట్ లోనే పెట్టుబడులు పెట్టేవారట.  ఒక సినిమాకు దాదాపు 12 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే త్రివిక్రమ్ తన సంపాదనలో మెజారిటీ భాగాన్ని రియల్ ఎస్టేట్ లోనే ఇన్వెస్ట్ చేశారట. ఆలా త్రివిక్రమ్ కు హైదరాబాద్.. విజయవాడ.. వైజాగ్ లో చాలా చోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయట.ఇదిలా ఉంటే తాజాగా త్రివిక్రమ్ ఫిలిం ఎగ్జిబిషన్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారట.  ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజానగరంలో రాయుడు థియేటర్ ను కొనుగోలు చేసిన త్రివిక్రమ్ ఆ థియేటర్ ను భారీ ఖర్చుతో ఆధునీకరణ చేసి కొత్త థియేటర్ లాగా మార్చారట.  ఈ థియేటర్ కోసం దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. ఈ థియేటర్ కు యజమానిగా మారడంతో త్రివిక్రమ్ ఇప్పుడు వినాయక్.. తేజ లాంటి థియేటర్ ఓనర్లయిన డైరెక్టర్ల లిస్టులో చేరారు.  మరి త్రివిక్రమ్ ఈ ఒక్క థియేటర్ తోనే ఆపుతారా లేదా ఫ్యూచర్ లో ఎగ్జిబిషన్ బిజినెస్ లోకి జోరుగా దూసుకెళ్తారా అనేది వేచి చూడాలి.

మహేష్ బాబు.. ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు కూడా ఈమధ్య మూవీ ఎగ్జిబిషన్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.  అల్లు అర్జున్ కూడా ఇదే రూట్లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే హీరోలందరూ మల్టిప్లెక్సులు ప్లాన్ చేస్తుంటే డైరెక్టర్లు సింగిల్ థియేటర్ల పై కాన్సంట్రేట్ చేస్తున్నారు.