Begin typing your search above and press return to search.

వాళ్ళతో పోలిస్తే తక్కువేనట

By:  Tupaki Desk   |   29 July 2015 5:38 AM GMT
వాళ్ళతో పోలిస్తే తక్కువేనట
X
శ్రుతిహాసన్‌ క్రేజు నానాటికి చుక్కల్ని తాకుతోంది అనడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్‌ చాలు. ప్రస్తుతం ఈ అమ్మడు మూడు భాషల్లో క్షణం తీరిక లేని షెడ్యూళ్ల తో బిజీ బిజీగా గడిపేస్తోంది. ఓ రోజు హైదరాబాద్‌ లో, ఇంకోరోజు చెన్నయ్‌ లో, మరొకరోజు ముంబై లో ఉంటోంది. అప్పటికప్పుడు షెడ్యూల్‌ ప్రకారం తన పని తాను చూసుకుంటోంది. ఈ అమ్మడి కాల్షీట్లు కావాలంటే ముందే అపాయింట్‌ మెంట్‌ కావాల్సిందే. పైగా పారితోషికంలో ఇప్పుడు పూర్తిగా సీన్‌ మారిపోయింది.

శ్రుతిని టచ్‌ చేయాలంటే లక్షల్లో పనవ్వడం లేదు. అక్షరాలా కోటిన్నర ఇచ్చుకోవాల్సిందే. లేదంటే తనని ఓ సినిమాకి ఒప్పించడం అనేది కుదరదు. అలాంటి అనుభవం ఇటీవల ఓ చిన్న నిర్మాతకి ఎదురైంది. ఏదైనా ఓ సినిమాలో నటించాలంటే 1.3కోట్లు పారితోషికంగా చెల్లించుకోవాలి. ఫస్ట్‌ క్లాస్‌ ఎయిర్‌ టిక్కెట్స్‌ అదనం. తనకి తన టీమ్‌ (మేకప్‌, డ్రైవర్‌ వగైరా) విమానం టిక్కెట్లు ఇవ్వాల్సిందే. అలాగే బస 7స్టార్‌ హోటల్‌ లో ఏర్పాటు చేయాల్సిందే. అక్కడ ఖర్చులన్నీ నిర్మాత నెత్తినే. వాస్తవానికి ఫిలింఛాంబర్‌, నిర్మాతల మండలి రూల్స్‌ ప్రకారం కథానాయికలకు కేవలం 3 స్టార్‌ ఫెసిలిటీ మాత్రమే ఇవ్వాల్సి ఉన్నా.. ఆ రూల్‌ ని ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఆ లెక్కన శ్రుతిహాసన్‌ పారితోషికం 1.5కోట్లు అన్నమాట. అంత పెద్ద మొత్తం చెప్పేసరికి సదరు నిర్మాతకి షాక్‌ కొట్టినంత పనైంది. ఉన్నట్టుండి ఒంట్లోకి 1000వోల్టుల విద్యుత్‌ ప్రవహించినట్టయ్యింది. సినిమా మాట దేవుడెరుగు? బతికుంటే బలుసాకు తిని బతుకుదాం అని ఫిక్సయిపోయాడంతే. ప్రస్తుతం శ్రుతి బాలీవుడ్‌ లో అందుకుంటున్న పారితోషికం 1.5కోట్లు. అక్కడ ఆలియా, సోనమ్‌, సోనాక్షి లాంటి నాయికలే రూ.5కోట్లు వసూలు చేస్తున్నారు కాబట్టి ఇది తక్కువేనని శ్రుతి భావిస్తున్నట్టుంది. అదీ మ్యాటరు.