Begin typing your search above and press return to search.

అర్జున్‌ - శృతిల 'మీటూ'.. టైం కావాలట

By:  Tupaki Desk   |   12 Feb 2019 9:06 AM GMT
అర్జున్‌ - శృతిల మీటూ.. టైం కావాలట
X
బాలీవుడ్‌ కే పరిమితం అనుకున్న మీటూ ఉద్యమం కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసిన విషయం తెల్సిందే. సౌత్‌ ఇండియా మొత్తం సుపరిచితుడు అయిన అర్జున్‌ పై హీరోయిన్‌ శృతి హరిహరన్‌ మీటూలో భాగంగా లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అర్జున్‌ తనను లైంగికంగా వేదించాడు అంటూ మీడియా ముందు వచ్చి చెప్పడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చిన విషయం తెల్సిందే. కేసు నమోదు చేసిన పోలీసులు అర్జున్‌ ను పిలిపించి విచారించారు.

కేసు నమోదు అయిన 90 రోజుల్లో చార్జ్‌ షీట్‌ దాఖలు అవ్వాల్సి ఉంటుంది. కాని అర్జున్‌ శృతిల మీటూ కేసులో ఇంకా విచారించాల్సిన వారు ఉండటంతో మరింత సమయం కావాలని ఈ కేసును విచారిస్తున్న కబ్బన్‌ పార్క్‌ పోలీసులు ఉన్నతాధికారులను కోరడం జరిగింది. ఇప్పటికే అర్జున్‌, శృతి హరిహరన్‌ లతో పాటు కొందరు సాక్షులను ప్రశ్నించాం. ఈ కేసు విషయంలో మరింత మంది సాక్ష్యులను విచారించాల్సి ఉంది. మొత్తం అందరిని విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో చార్జ్‌ షీట్‌ దాఖలు చేస్తామంటూ సెంట్రల్‌ విభాగం డీసీపీకి కబ్బన్‌ పార్క్‌ పోలీసులు తెలియజేశారు.

'విస్మయ' షూటింగ్‌ సమయంలో అర్జున్‌ తనను లైంగికంగా వేదించాడు అంటూ శృతి ఆరోపణలు చేస్తూ, కేసు పెట్టింది. ఈ కేసును రాజీతో ముగించేందుకు కన్నడ సినీ పరిశ్రమ పెద్దలు ప్రయత్నాలు చేశారు. కాని శృతి హరిహరన్‌ మాత్రం అందుకు ఒప్పుకోక పోవడంతో కేసు కంటిన్యూ అవుతుంది. అర్జున్‌ పై కేసు పెట్టడంతో శృతి కెరీర్‌ అర్థాంతరంగా ముగిసినట్లయ్యింది. తనకు అవకాశాలు చాలా తగ్గాయి అంటూ ఆమద్య శృతి హరిహరన్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పుకొచ్చింది.