Begin typing your search above and press return to search.

చేతిలో లేవు కాబట్టి.. శ్రీయ నీతులు!!

By:  Tupaki Desk   |   24 April 2017 6:24 AM GMT
చేతిలో లేవు కాబట్టి.. శ్రీయ నీతులు!!
X
ఒక్కపుడు ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్స్ మీకు గుర్తుండే ఉంటాయీ. అమ్మాయీకి ముందు జాబ్ ఉండదు.. ఫెయిర్నెస్ క్రీమ్ వాడుతుంది జాబ్ వస్తుంది. అబ్బాయిని అమ్మాయీ పట్టించుకొదు.. క్రీమ్ రాస్తాడు.. పడిపోతుంది. ఇలా చాలానే ఉన్నయీ ఫేస్ క్రీమ్ అడ్స్. ఇప్పుడు దాని పైనే చాలా చోట్లా చర్చలు జరుగుతున్నాయీ. మరీ ముఖ్యంగా నటీమణులు పై విమర్శ లు ఎక్కువ గా వస్తున్నాయి. వీళ్ళు అటువంటి బ్రాండ్స్ కి మద్దతు ఇచ్చి ఉండకూడదు అని చాలా మండి అభిప్రాయం. మరీ అలాంటి టైమ్ లో ఒక హీరోయిన్ ప్రెస్ లో కనిపిస్తే ఒక జర్నలిస్ట్ అడుగుతాడు కదా అదే జరిగింది ఇక్కడ.

అందాల ముద్దుగుమ్మ శ్రీయ ఒక ప్రెస్ మీట్ లో అలా అడిగిన ప్రశ్న కి బదులుగా ''అవును నా వరుకు నేను కొన్ని ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్స్ చేసినా.. అవి నాకేమీ గర్వకారణంగా లేవు. మీ వాదన సరైనదే. కాకపోతే అందం పై చాలా మంది కి పిచ్చి ఉంటుందిలే.. అలాగని ఇలాంటివి చేయకూడదు'' అంటూ నిజం చెప్పేసింది. సర్లేమ్మా.. ఇప్పుడు చేతిలో ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్స్ లేవు కాబట్టి.. అలాంటి నీతులే చెబుతారులే. అదే వీళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్లు చేయమని చెప్పండి. అబ్బే చెయ్యరుగా.

ఇకపోతే శ్రీయ ఇప్పుడు బాలయ్య తో మరో హిట్ కొట్టడానికి సిద్దం అవుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణి హిట్ తర్వాత వీళ్ళు మళ్ళీ పురి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న యాక్షన్ ఫిల్మ్ కోసం తిరిగి జంటగా నటిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/