Begin typing your search above and press return to search.

దేవదాస్ ఒరిజినలే అంటున్నాడు

By:  Tupaki Desk   |   25 Sep 2018 11:30 AM GMT
దేవదాస్ ఒరిజినలే అంటున్నాడు
X
నాగార్జున నానిల మల్టీ స్టారర్ దేవదాస్ విడుదలకు మరో 48 గంటల కంటే తక్కువ సమయమే ఉంది. ఇప్పటికే అంచనాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండగా మాస్ ని మెప్పించిన సినిమాలేవీ ఈ మధ్య పెద్దగా రాని కారణంగా హైప్ కూడా బాగా వచ్చింది. ఇకపోతే గత నాలుగైదు రోజులుగా దేవదాస్ కథ అప్పుడెప్పుడో 99లో వచ్చిన అనలైజ్ థిస్ అనే ఇంగ్లీష్ మూవీకి ఫ్రీ మేక్ అంటూ కాస్త గట్టిగానే ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో కూడా నానడంతో అభిమానులు సైతం కొంత అయోమయానికి గురయ్యారు.

కానీ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య వీటిని పూర్తి కొట్టి పారేస్తున్నాడు. ఇది అవాస్తవమని సత్యానంద్ భూపతి రాజాలాంటి సీనియర్ మోస్ట్ రైటర్ల తో పాటు తన టీమ్ మొత్తం ఎన్నో రోజులు కష్టపడి స్క్రిప్ట్ కు ఒక రూపం తీసుకువచ్చిందని ఇవన్నీ నిరాధారమని తేల్చి చెప్పాడు. ఇది పూర్తిగ అతన స్వంత కథ అంటున్న శ్రీరామ్ అసలు ఇది ఏ సినిమాకూ దేవదాస్ కాపీ కాదనే అంటున్నాడు.

పైన చెప్పిన హాలీవుడ్ మూవీకి పాత్రల పరంగా కొంత సారూప్యత ఉన్నప్పటికీ మిగిలినవన్నీ ఏ మాత్రం సంబంధం లేని విషయాలే. అయినా టాపిక్ ఏదైనా సరే క్షణంలో పావు వంతులో వైరల్ అవుతున్న 4జి ట్రెండ్ లో దేవదాస్ గురించి ఇలాంటి ప్రచారం జరగడం సహజమే. పైగా బిగ్ బాస్ షోలో నాని వ్వవహార శైలికి వ్యతిరేకంగా కొందరు ఇలా నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారన్న కామెంట్స్ కూడా జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో విడుదల అయ్యాకే నిజమేది అబద్దమేది అని తేలుతుంది. శ్రీరామ్ ఆదిత్య చెప్పింది నిజమే అయినా పక్షంలో రిలీజయ్యి సక్సెస్ అయ్యాక ఇంకా బలంగా చెప్పొచ్చు. కానీ ఈ లోపు ఇది ఇంకా వైరల్ కాకుండా అడ్డుకునేందుకు శ్రీరామ్ ఆదిత్య మీడియా అడిగిన ఈ కాపీ ఇష్యూ కి సంబందించిన క్లారిటీ ఇచ్చేసాడు. మణిశర్మ సంగీతం అందించిన దేవదాస్ లో ఆకాంక్ష సింగ్-రష్మిక మందన్న హీరోయిన్లు.