Begin typing your search above and press return to search.

మిస్టర్ వైట్ల బెస్ట్ అందించాడట

By:  Tupaki Desk   |   19 Feb 2017 4:27 AM GMT
మిస్టర్ వైట్ల బెస్ట్ అందించాడట
X
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఎదిగిన శ్రీను వైట్ల.. ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. ఆగడు.. బ్రూస్ లీ చిత్రాల పరాజయంతో చాలానే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందరూ మొహం చాటేస్తున్న సమయంలో.. వరుణ్ తేజ్ తో మిస్టర్ మూవీని స్టార్ట్ చేశాడు ఈ దర్శకుడు. కొన్ని వారాల క్రితం విడుదల చేసిన టీజర్ కు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మిస్టర్ ఔట్ పుట్.. చాలా బాగా వచ్చిందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రొమాన్స్.. ఎంటర్టెయిన్మెంట్ లను చాలా ఇంటెలిజెంట్ గా మిక్స్ చేశాడట వైట్ల. వరుణ్ హీరో వరుణ్ తేజ్ చేసే కామెడీ.. ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు లావణ్య త్రిపాఠితో ఈ మెగా హీరో చేసే రొమాన్స్.. సినిమాను పీక్స్ కు తీసుకువెళ్తుందని అంటున్నారు.

మిస్టర్ మూవీని చాలా సీరియస్ గా తీసుకున్న వైట్ల.. తన బెస్ట్ అందించేందుకు చాలా కష్టపడ్డాడని అంటున్నారు. తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి రావడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పటికే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిదా షూటింగ్ కోసం అమెరికాలో వాలిపోయిన సంగతి తెలుసు కదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/