Begin typing your search above and press return to search.

అమర్‌ అక్బర్‌ ఆంటోనీ..ట్రిపుల్‌ కామెడీనట!

By:  Tupaki Desk   |   8 Nov 2018 6:13 AM GMT
అమర్‌ అక్బర్‌ ఆంటోనీ..ట్రిపుల్‌ కామెడీనట!
X
రవితేజ - శ్రీనువైట్ల కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’. ఈ చిత్రం దర్శకుడికి - హీరోకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రంను మైత్రి మూవీస్‌ వారు నిర్మించిన నేపథ్యంలో సినిమాపై డిస్ట్రిబ్యూటర్స్‌ మరియు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ మరియు టీజర్‌ విడుదల తర్వాత ఈ చిత్రం శ్రీనువైట్ల రెగ్యులర్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ మాధిరిగా ఉండబోదు అనే టాక్‌ వచ్చింది. కాని ఈ చిత్రం శ్రీనువైట్ల గత చిత్రాల కామెడీకి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

సినిమాలో ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తక్కువ ఉంటుందేమో - కథ సీరియస్‌ గా సాగుతుందేమో అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ చిత్రం ఫుల్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ అంటూ చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా చిత్ర ప్రమోషన్‌ లో భాగంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఒక ఇంటర్వ్యూను వదలడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో రవితేజ - శ్రీనువైట్లతో పాటు కమెడియన్స్‌ శ్రీనివాస్‌ రెడ్డి - వెన్నెల కిషోర్‌ - సత్య - గిరిలు పాల్గొన్నారు.

సినిమాలో కామెడీ విషయమై రవితేజ మాట్లాడుతూ.. అమర్‌ - అక్బర్‌ - ఆంటోనీ పాత్రలు మూడు కూడా కామెడీని చేసి ప్రేక్షకులను నవ్విస్తాయి అన్నాడు. సందర్బానుసారంగా ప్రతి పాత్ర కూడా కామెడీతో సాగుతుందని పేర్కొన్నాడు. శ్రీనువైట్ల మార్క్‌ కామెడీ చిత్రంలో ఉంటుందని రవితేజ ప్రేక్షకులకు హామీ ఇచ్చాడు. ఇక శ్రీను వైట్ల కూడా తమ సినిమాలో తన గత చిత్రాల మాదిరిగానే ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఉంటుందని అన్నాడు. ‘దూకుడు’ చిత్రంలో ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తో పాటు ఎమోషన్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాని ఈ చిత్రంలో మాత్రం ఎమోషన్‌ తక్కువ ఉండి - ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు.

టీజర్‌ వల్ల సినిమాకు వచ్చిన సీరియస్‌ మార్క్‌ ను పోగొట్టేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత మంది కమెడియన్స్‌ ఉన్నప్పుడు కామెడీ లేకుండా ఎలా ఉంటుంది - తప్పకుండా సినిమా మంచి కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా ఉంటుందని ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఒక అభిప్రాయంకు వచ్చేశారు.