Begin typing your search above and press return to search.

చివరి వైట్ల దానికే ఫిక్సయ్యాడు

By:  Tupaki Desk   |   10 Feb 2016 3:30 PM GMT
చివరి వైట్ల దానికే ఫిక్సయ్యాడు
X
‘రెడీ’ సినిమా శ్రీను వైట్ల జాతకాన్నే మార్చేసింది. వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేశాడు. టాలీవుడ్ లో అత్యధిక పారితోషకం అందుకునే టాప్ డైరెక్టర్ లలో ఒకడిగా ఎదిగాడు. ఐతే ‘ఆగడు’ వరకు వైట్ల పరిస్థితి బాగానే ఉంది కానీ.. ఆ సినిమా డిజాస్టరయ్యాక మళ్లీ జాతకం మారిపోయింది. ‘ఆగడు’తో కింద పడ్డ వైట్లను ‘బ్రూస్ లీ’పాతాళానికి తొక్కేసింది. ఆ సినిమా అయ్యాక వైట్ల పరిస్థితి ఏమీ బాగా లేదు. మళ్లీ ‘రెడీ’ ముందు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అలాంటి స్థితికి చేరాడు వైట్ల. ఇప్పుడు ‘రెడీ’ లాంటి సినిమాతోనే తనేంటో రుజువు చేసుకోవాలని చూస్తున్న వైట్ల.. ‘రెడీ’కి సీక్వెల్ చేయాలనుకుంటున్నట్లు కొన్నాళ్ల కిందట వార్తలొచ్చాయి.

ఇప్పుడు అదే నిజమని తేలింది. ‘రెడీ’కి కొనసాగింపుగా సినిమా చేయాలని ఫిక్సయిన వైట్ల.. నిర్మాతను కూడా చూసుకోకుండా సీరియస్ గా స్క్రిప్టు పనిలో మునిగిపోయాడట. మళ్లీ తనేంటో చూపించాలా స్క్రిప్టు రెడీ చేసి ఆ తర్వాతే నిర్మాతను వెతకాలని చూస్తున్నాడట. ప్రస్తుతం తన రచయితల బృందంతో రెగ్యులర్ గా సిట్టింగ్స్ వేస్తున్నాడట వైట్ల. ఇంకో రెండు మూడు నెలల వరకు వైట్ల ఈ మూడ్ నుంచి బయటికి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఎలాగూ రామ్ కూడా ‘నేను శైలజ’ సక్సెస్ అందుకుని కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాడు కాబట్టి.. తమ ఇద్దరి కాంబినేషన్ లో‘రెడీ-2’ మొదలుపెడితే మాంచి క్రేజ్ వస్తుందని చూస్తున్నట్లున్నాడు వైట్ల.