Begin typing your search above and press return to search.

వైట్ల టార్గెట్ మహేషా?

By:  Tupaki Desk   |   30 Nov 2015 1:30 PM GMT
వైట్ల టార్గెట్ మహేషా?
X
వినడానికి ఏదోలా అనిపించినా ఇది వాస్తవం. శ్రీను వైట్ల మహేష్ బాబును కలుస్తున్నట్లు సమాచారం. ఇదేమీ క్యాజువల్ కలయిక కూడా కాదు. మహేష్ కోసం తాను తయారు చేసిన ఓ లైన్ పట్టుకుని అతణ్ని కలుస్తున్నాడట వైట్ల. ప్రస్తుతం వైట్ల పరిస్థితి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆగడు - బ్రూస్ లీ లాంటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత వైట్లను పట్టించుకునే నాథుడే లేడు. పెద్ద హీరోలందరూ దండం పెట్టేస్తుంటే మీడియం రేంజి హీరోలు కూడా దొరకని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తనతో ‘రెడీ’ చేసిన రామ్‌‌ తో మళ్లీ వైట్ల జట్టు కట్టబోతున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు లేకపోవడంతో వైట్ల మనసు మార్చుకున్నాడట.

ఇలా చిన్న, మీడియం రేంజి హీరోల వెంట పడుతుంటే తాను మరింత లోకువైపోతానన్న ఆలోచనతో మహేష్ కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం. తాను అనుకున్న ఓ లైన్‌ మహేష్‌ కు వినిపించి సిన్సియర్‌ గా ఓ ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాడట వైట్ల. ‘ఆగడు’ సంగతి ఏమైనప్పటికీ తన కెరీర్ ఇబ్బందుల్లో ఉండగా ‘దూకుడు’ లాంటి బ్లాక్‌ బస్టర్ ఇచ్చిన వైట్లపై మహేష్‌ కు చాలా అభిమానమే ఉంది. ఆ అభిమానంతో వైట్ల కథ వినడానికి నో చెప్పనైతే చెప్పడు. ఐతే మహేష్ ప్రస్తుతం ఎంత బిజీనో తెలిసిందే. బ్రహ్మోత్సవం చేస్తున్నాడు, మురుగదాస్ సినిమా లైన్ లో ఉంది. ఇంకా కొందరు డైరెక్టర్లు వెయిటింగ్‌ లో ఉన్నారు. ఐతే మహేష్ తన కథకు ఓకే చెప్పాలే కానీ.. వైట్ల ఎంత కాలమైనా ఎదురు చూస్తాడనడంలో సందేహం లేదు. ఖాళీ ఎక్కువుంటే మంచి స్క్రిప్టు రెడీ చేయడానికి కూడా ఛాన్స్ దొరుకుతుంది కదా. కాబట్టి మహేష్ కరుణిస్తాడేమో చూద్దాం.