అలాంటి బయోపిక్ చేస్తానంటున్న డైరెక్టర్

Thu Nov 15 2018 21:00:01 GMT+0530 (IST)

శ్రీను వైట్ల తాజా చిత్రం 'అమర్ అక్బర్ అంటోనీ' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.  థ్రిల్లర్ కథాంశంతో.. వైట్ల మార్క్ కామెడీతో రానున్న ఈ సినిమా సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. రవితేజతో శ్రీను వైట్ల చేసిన సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధించడంతో ఈ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని వైట్ల నమ్మకంగా ఉన్నాడు.ఈమధ్య ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బయోపిక్స్  గురించి మాట్లాడాడు.  లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ 'మహానటి' ని ఈమధ్యే చూశాడట.  ఆ సినిమాకు దర్శకత్వం వహించిన విధానం తనకు ఎంతో నచ్చిందని.. సినిమా ఒక మాస్టర్ పీస్ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.  తనకూ ఒక బయోపిక్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉందని.. ఇప్పుడు ఎలాగు బయోపిక్ ట్రెండ్ ఉంది కాబట్టి బయోపిక్ తెరకెక్కించేందుకు ఒక గ్రేట్ పర్సనాలిటీని వెతుక్కోవాలని అన్నాడు.

కాకపోతే తన సినిమానుండి ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ను ఆశిస్తారని అందుకే ఎవరి జీవితాన్నైతే బయోపిక్ కోసం ఎంచుకుంటానో ఆ స్టొరీకి కామెడీ టచ్ ఇవ్వగలిగేలా ఉండాలన్నాడు. ఐడియా బాగానే ఉంది వైట్ల సారూ..  వై నాట్ యు కన్సిడర్ జంధ్యాల గారు!