Begin typing your search above and press return to search.

శ్రీను వైట్ల పరిస్థితేంటి మరి?

By:  Tupaki Desk   |   29 May 2016 6:44 AM GMT
శ్రీను వైట్ల పరిస్థితేంటి మరి?
X
ఇప్పటికే దర్శకుడు శ్రీను వైట్ల గ్రాఫ్‌ ఘోరంగా పడిపోయింది. ఎప్పుడైతే ''బ్రూస్ లీ'' సినిమా విషయంలో తేడా కొట్టేసిందో.. అప్పుడే హీరోలందరూ కాస్త షేక అయిపోయారు. అప్పటికే ఆగడు డిజాష్టర్‌ కూడా నెత్తిమీద ఉండటంతో.. వైట్లకు కాస్త కష్టమే అన్నారు. ఇంతలో సడన్‌ గా వరుణ్‌ తేజ్‌ తో మిష్టర్‌ అనుకున్నాడు వైట్ల. కాని అక్కడే అసలు చిక్కొచ్చింది.

ఈపాటికే ''మిష్టర్'' సినిమా మొదలైపోవాలి. కాని ఇంతవరకు సినిమాకు సంబంధించి స్పెయిన్‌ వీసాలు రావట్లేదనే కారణంతో సినిమాను డిలే చేస్తున్నారు. ఇంతలో వరుణ్‌ రెమ్యూనరేషన్‌ కూడా ఒక ఇష్యూ అని తెలుస్తోంది. చూస్తుంటే ఇదంతా శేఖర్‌ కమ్ములతో సినిమా మొదలు పెట్టడానికి వరుణ్‌ కావాలనే డిలే చేస్తున్నాడా అన్నట్లుంది. సర్లేండి.. వరుణ్‌ ఏ సినిమా మొదలెట్టినా కూడా.. వైట్ల తదుపరి ఏం చేస్తాడు అనేదే అందరి క్వశ్చన్.

ఇప్పటివరకు ఒకే కథను పట్టుకొని.. ఒకే హీరోతో ట్రావెల్‌ చేస్తున్నాడట వైట్ల. ఒకవేళ తదుపరి సినిమా చేయాలంటే.. ఈయనతో సినిమా చేసిన హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేరు. మొన్నటివరకు ఖాళీగా ఉన్న రామ్‌ కూడా ఇప్పుడు రెండు ప్రాజెక్టులు ఓకే చేసుకున్నాడు. సో.. వైట్ల ఎవరితో సినిమా చేస్తాడో ఏంటో!!