Begin typing your search above and press return to search.

కామెడీ హీరోగా ట్రాక్ ఎక్కినట్లేనా

By:  Tupaki Desk   |   21 Aug 2017 10:27 AM GMT
కామెడీ హీరోగా ట్రాక్ ఎక్కినట్లేనా
X
కమీడియన్లుగా స్టార్ స్టేటస్ రాగానే హీరోలుగా మారే సంస్కృతి ఆ నాటి నుంచి టాలీవుడ్ లో నడుస్తూనే ఉంది. అయితే అలనాటి కమీడియన్లు హీరోలుగా సినిమాలు చేస్తూనే కమీడియన్లుగా కూడా కొనసాగే వారు. కానీ నేటి హాస్యనటుల్లో అది కొరవడిందనే చెప్పాలి. నేటి తరం హాస్యనటుల్లో సునీల్ కామెడీని మానేసి పూర్తిగా హీరోగా అయిపోయి పలు సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. అదే దారిలో నడిచేందుకు సప్తగిరి ట్రై చేస్తున్నాడు. మొదటి సినిమాతోనే ఫెయిల్ అయ్యాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ కు కలెక్షన్స్ వచ్చాయని ప్రచారం చేసినా - ట్రేడ్ వర్గాలు ఈ సినిమా పై అసంతృప్తిగానే ఉన్నాయి.

ఇక సెలెంట్ హీరో అయిపోయాడు మరో స్టార్ కమీడియన్ శ్రీనివాస రెడ్డి. గీతాంజలి వంటి హారర్ కామెడీ సబ్జెక్ట్ ని ఎంచుకొని మొదటి ప్రయత్నంలోనే భారీ హిట్ కొట్టాడు శ్రీనివాసరెడ్డి. అయితే తోటివారిలా కాకుండా శ్రీనివాసరెడ్డి తెలివిగా తన కెరీర్ ని లాకొస్తున్నాడు. అలనాటి హస్యనటుల్నే ఆదార్శంగా తీసుకొని కమీడియన్ గా రాణిస్తూనే మధ్య మధ్యలో హీరోగా ట్రై చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతేడాది విడుదలైన జయంబునిశ్చంబురా - తాజాగా విడుదలైన ఆనందో బ్రహ్మ సినిమాలతో శ్రీనివాసరెడ్డి హీరోగా సక్సెస్ అందుకున్నాడనే చెప్పాలి. అయితే శ్రీనివాసరెడ్డికి ఈ సక్సెస్ తను కథల్ని ఎంచుకునే రీతిని బట్టే లభించిందని సినీజనాలు అంటున్నారు. హీరో కాగానే కామెడీ ట్రాక్ ని లూప్ లో పెట్టేసి నాలుగు ఫైట్లు ఆరు పాటలు చేయడంలో కమీడియన్లు ఇంట్రెస్ట్ చూపుతున్నారని - అందుకే సక్సెస్ అందుకోలేకపోతున్నారనే టాక్ ఉంది. హీరోయిజంలో ఉన్న డాన్స్ - ఫైట్లకి శ్రీనివాసరెడ్డి కాస్త దూరంగానే ఉంటున్నాడు. మరి ఇదే తీరును శ్రీను ఫ్యూచర్ లో కూడా ఫాలో అవుతూ హీరోగా తన మార్కెట్ పెంచుకుంటాడేమో చూద్దాం.