Begin typing your search above and press return to search.

ఇట్స్ క్లియర్.. 'కళ్యాణం' డిజాస్టరే

By:  Tupaki Desk   |   16 Aug 2018 10:37 AM GMT
ఇట్స్ క్లియర్.. కళ్యాణం డిజాస్టరే
X
తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా.. మొదటి రెండు రోజుల్లో వసూళ్లు ఆశాజనకంగా లేకపోయినా.. ఆ తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’ పుంజుకుందని.. హౌస్ ఫుల్స్ పడుతున్నాయని.. కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని గొప్పగా ఆదరిస్తున్నారని దిల్ రాజు ఘనంగా ప్రకటించుకున్నాడు. వీకెండ్లో కొంచెం వసూళ్లు పుంజుకుంటే పుంజుకుని ఉండొచ్చు కానీ.. ఈ సినిమా ఆ తర్వాత నిలబడలేదన్నది స్పష్టమైంది. సోమవారం నుంచి ఒక్కసారిగా వసూళ్లు పడిపోవడంతో సినిమా భవితవ్యం ఏంటో తేలిపోయింది. తర్వాత మూడు రోజుల్లో నామమాత్రపు వసూళ్లు సాధించిన ‘శ్రీనివాస కళ్యాణం’ అంతిమంగా డిజాస్టర్ అని తేలిపోయింది. తొలి వారాంతంలో రూ.9.5 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం.. తర్వాతి మూడు రోజుల్లో రాబట్టిన షేర్ రూ.2.2 కోట్లు మాత్రమే. ఇక బుధవారం విడుదలైన ‘గీత గోవిందం’ జోరుకు అసలీ సినిమా నిలబడలేకపోయింది. రెండో వీకెండ్ మీద ఆశలేమీ లేని స్థితిలో బ్రేక్ ఈవెన్ కు రావాలంటే రూ.25 కోట్లకు పైగా రాబట్టాల్సిన ఈ చిత్రం.. అందులో సగం తేవడం కూడా కష్టంగానే ఉంది. కాబట్టి ఇది డిజాస్టర్ అని తీర్మానించేయొచ్చు.

ఏరియాల వారీగా తొలి వారంలో ‘శ్రీనివాస కళ్యాణం’ వరల్డ్ వైడ్ షేర్ల వివరాలు..

నైజాం- రూ.4.7 కోట్లు
వైజాగ్- రూ.1.3 కోట్లు
తూర్పు గోదావరి- రూ.70 లక్షలు
పశ్చిమ గోదావరి- రూ.57 లక్షలు
కృష్ణా- రూ.60 లక్షలు
గుంటూరు- రూ.75 లక్షలు
నెల్లూరు- రూ.31 లక్షలు
సీడెడ్- రూ.1.4 కోట్లు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.10.2 కోట్లు
ఇండియాలోని మిగతా ఏరియాల్లో- రూ. 72 లక్షలు
యుఎస్- రూ.75 లక్షలు
వరల్డ్ వైడ్ షేర్- రూ.11.7 కోట్లు

Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!