ఆడియో రివ్యూ: అచ్చమైన పెళ్లి సంగీతం

Sun Jul 22 2018 13:12:29 GMT+0530 (IST)

నితిన్ రాశి ఖన్నా జంటగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో రూపొందిన శ్రీనివాస కళ్యాణం ఆడియో చెప్పిన సమయానికి ముందు గానే నిన్న సాయంత్రం ఆన్ లైన్ లో విడుదల చేసారు. ఐ ట్యూన్స్ తో పాటు వివిధ సైట్స్ లో ప్రకటించిన టైం కన్నా ముందే ట్రాక్స్ అందుబాటులోకి రావడంతో షాక్ తిన్న యూనిట్ ఆలస్యం చేయకుండా రిలీజ్ చేసింది. టైటిల్ మొదలుకుని షూటింగ్ అప్ డేట్స్ దాకా ప్రతి దశలోనూ ఆసక్తి రేపిన శ్రీనివాసకళ్యాణంకు సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్. ఇదే కాంబోలో వచ్చిన శతమానం భవతి మంచి మ్యూజికల్ హిట్ గా పేరు తెచ్చుకున్న నేపధ్యంలో దీని మీద మ్యూజిక్ లవర్స్ కు మంచి అంచనాలు ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగా ఆల్బమ్ ఉందా లేదా ఓ లుక్ వేద్దాంటైటిల్ సాంగ్ గా ట్యూన్ చేసిన కళ్యాణం వైభోగం కొద్ధి రోజుల క్రితమే విడుదలై బాగా ఆదరణ చూరగొన్న సంగతి తెల్సిందే. బాలసుబ్రమణ్యం మధురమైన గాత్రం పాట స్థాయిని ఎన్నో రేట్లు పైకి తీసుకెళ్లింది. రెండో సాంగ్ ఎక్కడ నువ్వుంటే హీరో థీమ్ సాంగ్. మరీ స్పెషల్ గా కాదు కానీ మిక్కీ స్టైల్ లో క్యాచీగానే ఉంది. ధనుంజయ్ గాత్రం బాగుంది. మూడో పాట  ఇతడేనా ఇతడేనా శ్రేయ ఘోషల్ స్వీట్ వాయిస్ లో మెలోడీ ట్యూన్ తో ఎక్కడికో  తీసుకెళ్తుంది. ఈ మూడు పాటలు శ్రీమణి రాశారు. ఇక నాలుగో పాట మొదలవుదాం రామజోగయ్య శాస్ట్రీ సాహిత్యంలో మిక్కీ సిగ్నేచర్ ట్యూన్ లో వినిపిస్తుంది.

ఐదో పాట సం థింగ్ సం థింగ్ అనురాగ్-శ్రావణి గాత్రాలతో పాటు రాశి ఖన్నా గొంతు కూడా కలిసింది. శ్రీమణి రేసి రైమింగ్ కి ఫాస్ట్ బీట్ గా కంపోజ్ చేసిన   తీరు ఆకట్టుకుంటుంది. వినవమ్మా తూరుపు చుక్కా  అంటూ సాగే ఆరో పాటలో సీనియర్ గాయని సునీత వాయిస్ సాంప్రదాయ వేడుకలకు అద్దం పట్టేలా ఉంది. ఇక క్లైమాక్స్ వెర్షన్ అంటూ టైటిల్ సాంగ్ ని మరోసారి స్వల్ప మార్పులతో రిపీట్ చేసారు. మొత్తానికి చాలా కాలం తర్వాత తీయని మామిడి పండును మనసారా తింటూ ఆస్వాదిస్తున్న తరహాలో చక్కని ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ జె మేయర్ హోరెత్తిపోతున్న బీట్స్ మధ్య ఆహ్లాదకరమైన సంగీతం ఇచ్చి మెప్పించాడు. ఆగస్ట్ 9న విడుదల కానున్న శ్రీనివాస కళ్యాణం ఆడియో వల్ల హైప్ అమాంతం పైకి తీసుకెళ్లేలా ఉంది.


వీడియో కోసం క్లిక్ చేయండి