Begin typing your search above and press return to search.

హ‌స్కీ హీరోయిన్ ఊపేస్తుంద‌ట‌!

By:  Tupaki Desk   |   10 Dec 2018 5:28 AM GMT
హ‌స్కీ హీరోయిన్ ఊపేస్తుంద‌ట‌!
X
అందాల పోటీల నుంచి మిస్ దివా- 2016 గా ఎంపికై తొలి ప్ర‌య‌త్న‌మే `కేజీఎఫ్` లాంటి భారీ చిత్రంలో అవ‌కాశం అందుకుంది శ్రీ‌నిధి శెట్టి. అందాల‌ పోటీల్లో కిరీటం గెలిచిన రెండేళ్ల‌లో భారీ ఆఫ‌ర్ ద‌క్క‌డంతో ఈ మంగుళూరు బ్యూటీ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోందిట‌. ఈ సినిమా ఇప్ప‌టికే పాన్ ఇండియా చిత్రంగా భారీ క్రేజు ద‌క్కించుకుంది. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి లాంటి దిగ్గ‌జం ఈ చిత్రానికి అన్ని ర‌కాలుగా బాస‌ట‌గా నిల‌వ‌డంతో తెలుగు - హిందీ - క‌న్న‌డ‌ - త‌మిళం - మ‌ల‌యాళంలో అత్యంత భారీగా రిలీజ‌వుతోంది. ఈగ‌ - బాహుబ‌లి పంపిణీదారులైన వారాహిచ‌ల‌న‌చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి కేజీఎఫ్ తెలుగు రిలీజ్‌ కి బ్యాక‌ప్‌ గా ఉండ‌డంతో ఇక్క‌డా అంతే క్రేజు నెల‌కొంది.

కేజీఎఫ్ చిత్రంతో శ్రీ‌నిధి పాపులారిటీ అన్ని భాష‌ల్లోనూ పెరుగుతుంది. దీంతో అన్ని వైపుల నుంచి ఆఫ‌ర్లు వెల్లువెత్త‌డం ఖాయ‌మ‌ని భావిస్తోంద‌ట‌. నిన్న‌టి సాయంత్రం హైద‌రాబాద్ జేఆర్‌ సీ సెంట‌ర్‌ లో శ్రీ‌నిధి శెట్టి ఓ రేంజులో హ‌డావుడి చేసింది. చూడ‌టానికి అచ్చం బిపాసా చెల్లిలా ఉందే! అంటూ తెలుగు కుర్రాళ్లు కామెంట్లు చేశారు. శ్రీ‌నిధి ఒడ్డు పొగుడు - వాక్చాతుర్యం అంద‌రినీ మైమ‌రిపించాయి. అందుకే అందాల రాణిగా.. మిస్ దివాగా కిరీటం ద‌క్కించుకుని ఇప్పుడు ఇండ‌స్ట్రీని ఏలేందుకు వ‌చ్చిందంటూ వ్యాఖ్య‌లు వినిపించాయి.

శ్రీ‌నిధి రియ‌ల్ ల‌క్కీ గాళ్. ఇప్ప‌టికీ త‌న తోటి అందాల రాణుల‌కు అస‌లు సినీ ఛాన్సులే లేవు. అంతెందుకు ప్ర‌పంచ సుంద‌రి మానుషి చిల్ల‌ర్ ఎంత‌గా కోరుకున్నా ఒక్క సినీ ఛాన్స్ కూడా లేదు. ఇంకా బాలీవుడ్ హీరోల్ని - ఖాన్‌ ల త్ర‌యాన్ని బ‌తిమాలుతూనే ఉంది. కానీ ఎవ‌రూ పిలిచి అవ‌కాశం ఇవ్వ‌లేదు. బాహుబ‌లి త‌ర్వాత బాహుబ‌లి అంత చిత్రంగా ప్ర‌చారం అవుతున్న కేజీఎఫ్ తో అవ‌కాశం అందుకున్న‌ శ్రీ‌నిధి శెట్టి మాత్రం అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో వేగంగా పాపుల‌ర్ అయిపోతోంది. కేజీఎఫ్ రిలీజై హిట్ కొడితే చాలు.. ఈ అమ్మ‌డు స్కైని తాకేస్తుంద‌ని - చుక్క‌ల్లో చంద్రిక అయిపోతుంద‌ని యూత్ ఒక‌టే గుస‌గుస‌లాడేస్తున్నారు. ఇక కేజీఎఫ్ -తెలుగు ప్ర‌చారంలోనూ త‌న‌దైన మాట తీరుతో ఆక‌ట్టుకుంది ఈ అమ్మ‌డు. వేదిక‌పై రాజ‌మౌళి స‌హా ఎంద‌రో దిగ్గ‌జాల ముందు డేరింగ్ & డ్యాషింగ్ యాటిట్యూడ్‌ తో మెస్మ‌రైజ్ చేసింది. కేజీఎఫ్ ఈనెల 21న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.