Begin typing your search above and press return to search.

మహేష్ కు ఈ మాత్రం సపోర్ట్ చాలు

By:  Tupaki Desk   |   3 Aug 2015 7:02 AM GMT
మహేష్ కు ఈ మాత్రం సపోర్ట్ చాలు
X
ఏదో ఒక్క భాషలో సూపర్ స్టార్ అనిపించుకుంటే సరిపోదు. వేరే రాష్ట్రాల్లోనూ సత్తా చూపించాల్సిందే. తమిళ హీరోలు ముందు నుంచి తెలుగులో జోరు చూపిస్తున్నారు. మన హీరోల్లో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోంది. అల్లు అర్జున్ మల్లూవుడ్ లో అడుగుపెట్టి ఇప్పుడు మూడు నాలుగు కోట్ల మార్కెట్ సంపాదించుకునే స్థాయికి ఎదిగాడు. బాహుబలి మిగతా భాషల్లో భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టి కంటెంట్ ఉంటే ఎక్కడైనా కలెక్షన్లు కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఈ ఊపులో మహేష్ బాబు కూడా తమిళ మార్కెట్ పై కన్నేశాడు. మహేష్ సినిమాలు ఇంతకుముందు కూడా తమిళంలోకి డబ్ అయ్యాయి కానీ.. అవన్నీ మొక్కుబడిగా చేసినవే.

ఐతే శ్రీమంతుడు విషయంలో మాత్రం మహేష్ చాలా సీరియస్ గా ఉన్నాడు. నెల రోజుల కిందట సినిమాటోగ్రాఫర్ మాధి సలహా మేరకు శ్రీమంతుడు సినిమాను తమిళంలోనూ ఒకేసారి విడుదల చేయడానికి నిర్ణయించుకున్నాడు. డబ్బింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఐతే అతడి ప్రయత్నం వృథాగా ఏమీ పోలేదు. ‘సెల్వందన్’కు తమిళనాట మంచి క్రేజే కనిపిస్తోంది. ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్స్ వచ్చేసినట్లు చెబుతున్నారు. తమిళ వెర్షన్ రైట్స్ ను రూ.3 కోట్లకు అమ్మగా.. అన్ని ఏరియాల్లోనూ మంచి బిజినెస్ జరిగి.. టేబుల్ ప్రాఫిల్ వచ్చినట్లు చెబుతున్నారు. మూడు కోట్లన్నది చిన్న ఫిగరే కావచ్చు. కానీ తొలిసారి సీరియస్ గా దృష్టిపెడితే మూడు కోట్లొచ్చాయి. మంచి బిజినెస్ కూడా జరిగింది. ఈ సినిమా హిట్టయితే ఆటోమేటిగ్గా మనోడి మార్కెట్ పెరుగుతుంది. తర్వాతి సినిమా రేంజే వేరుగా ఉంటుంది. అందులోనూ బ్రహ్మోత్సవం సినిమాను తీయడమే తెలుగు, తమిళ భాషలు రెండిట్లోనూ తీయబోతున్నారు. కాబట్టి మహేష్ ముందు ముందు తమిళంలోనూ స్టార్ ఇమేజ్ తెచ్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.