Begin typing your search above and press return to search.

శ్రీమంతుడు మళ్లీ వాయిదా పడితే?

By:  Tupaki Desk   |   31 July 2015 11:48 AM GMT
శ్రీమంతుడు మళ్లీ వాయిదా పడితే?
X
మహేష్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు ఆగస్టు 7న రిలీజవుతుందనే అంతా అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయని సమాచారం. మరోసారి బాహుబలి కోసమే శ్రీమంతుడిని వెనక్కి పంపించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ సినిమా మరో వారం ఆలస్యమయ్యేందుకు ఆస్కారం ఉందని అంటున్నారు.

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి ఇంటా బైటా రికార్డుల మోత మోగిస్తోంది. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లోను, మరోవైపు ఓవర్సీస్‌ లోనూ ఈ సినిమ కలెక్షన్ల ప్రభంజనం సాగిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి. అందుకే రాబోయే పెద్ద సినిమా కోసం థియేటర్ల నుంచి బాహుబలిని తొలగించడం కుదరదు. కాబట్టి శ్రీమంతుడుని మరోమారు వాయిదా వేసే ఛాన్సుందని కొందరు పంపిణీదారులు స్వయంగా చెబుతున్నారు.

అయితే అప్పట్లో మహేష్‌, కొరటాల అండ్‌ మైత్రి మూవీస్‌ అధినేతలు పక్కా జెంటిల్మన్‌ తరహాలో భారతీయ సినిమా ఖ్యాతిని పెంచే సినిమా బాహుబలి అని ప్రకటించి తమ సినిమాని వాయిదా వేశారు. ఇప్పుడు కూడా మరోసారి అదే తీరుగా వ్యవహరించి బాహుబలి మరిన్ని రికార్డుల్ని తన ఖాతాలో వేసుకునేందుకు సాయపడతారనే అంతా ఆశిస్తున్నారు. ఎదేమైనా అభిమానులు మాత్రం సినిమా పొస్ట్ పోన్ కాకూడదని కోరుకుంటున్నారు.