Begin typing your search above and press return to search.

శ్రీ‌మంతుడు సీన్‌ కి సౌండింగ్ అదుర్స్‌

By:  Tupaki Desk   |   21 Sep 2018 11:49 AM GMT
శ్రీ‌మంతుడు సీన్‌ కి సౌండింగ్ అదుర్స్‌
X
అమ్మాయికి లైనేసే సీన్ తీయ‌మంటే చాలు. మ‌న డైరెక్ట‌ర్లు చెల‌రేగిపోతారు. ఇదిగో ప్యార‌డీనే అయినా ఓ రేంజులో వ‌ర్క‌వుటైంది ఆ సీన్‌. ఈరోజు థియేట‌ర్ల‌లో రిలీజైన `న‌న్ను దోచుకుందువ‌టే` చిత్రంలోని ఆ సీన్‌ కి థియేట‌ర్‌ లో క్లాప్స్ - విజిల్స్ మార్మోగిపోతున్నాయ్‌. `శ్రీ‌మంతుడు` సీన్ ప్యార‌డీలో బావ సుధీర్‌ బాబు ప్రేక్ష‌కుల‌తో విజిల్స్ వేయించుకున్నాడు. థియేట‌ర్‌ లో సీన్ బాగా వ‌ర్క‌వుటైంద‌న‌డానికి ఇదిగో ఇదే ప్రూఫ్‌. అంతేకాదు.. ఆ సీన్‌ ని ఎవ‌రో వీరాభిమాని ఏకంగా మొబైల్ ఫోన్‌ లో రికార్డ్ చేసి మ‌రీ సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశాడు.

`శ్రీ‌మంతుడు` చిత్రంలో మ‌హేష్ కార్‌ లో వెళుతూ - ఇంటి వాకిట్లో ముగ్గేస్తున్న‌ డాళింగ్ శ్రుతిహాస‌న్‌ ని చూస్తాడు. ఆ అందానికి ముగ్ధుడై అక్క‌డిక‌క్క‌డే మూడు రౌండ్లు కొడ‌తాడు. సేమ్ సీన్‌ ని దించేశాడు సుధీర్‌ బాబు. అయితే అక్క‌డ మ‌హేష్ కార్‌ లో ఫ్యామిలీ ఉంటుంది కాబ‌ట్టి డీసెంట్‌ గా చూసి వెళ్లిపోతాడు. ఇక్క‌డ సుధీర్ బాబు కార్‌ లో ఒక్క‌డే కాబ‌ట్టి, డాళింగ్ న‌భా న‌టేష్‌ కి క‌న్నుకొట్టి - ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి మ‌రీ కార్‌ లో రౌండ్లు తిప్పేస్తాడు. వైట్ & వైట్ డ్రెస్‌ లో ఆరుబ‌య‌ట ముగ్గేస్తూ న‌భా న‌టేష్ కుర్రాళ్ల మ‌న‌సు దోచింది. ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపిస్తూనే ఈ అమ్మ‌డు ఎక్స్‌ ప్రెష‌న్స్‌ లో బోలెడ‌న్ని స‌రాగాలు ప‌లికించింది. మా అబ్బాయిని ఎప్పుడు క‌లిశావ్‌? అని హీరో డాడ్ అడ‌గ్గానే హీరోయిన్ న‌భా త‌న ప్రేమ‌క‌థ‌ను వినిపించే సీన్ అది. బాగా వ‌ర్క‌వుటైంది. అలానే సినిమాకి 3 రేటింగులు వ‌చ్చాయంటే హిట్టు కొట్టాడ‌నే దీన‌ర్థం. తొలి వీకెండ్‌ - తొలివారంలో ఈ సినిమా వ‌సూళ్ల వివ‌రాన్ని బ‌ట్టి స్థాయిని అంచ‌నా వేయొచ్చు.

సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ (ఎస్‌ బి) బ్యాన‌ర్‌ లో తొలి సినిమాతోనే ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నాడు. కొత్త కుర్రాడు ఆర్‌.ఎస్‌.నాయుడు తొలి ప్ర‌య‌త్నం ఫిలించిన‌ట్టే. ఇక‌పోతే ఇదే హుషారులో సుధీర్‌ బాబు త‌దుప‌రి మరింత‌మంది కొత్త కుర్రాళ్ల‌ను ప్రోత్స‌హించేందుకు ఆస్కారం ఉంటుందన‌డంలో సందేహం లేదు. మునుముందు ప‌లువురు ల‌ఘు చిత్రాల ద‌ర్శ‌కుల‌కు సుధీర్‌ బాబు అవ‌కాశం ఇచ్చే ఛాన్సుంది.