Begin typing your search above and press return to search.

అదే మ‌రి... మ‌హేష్ క్రేజ్ అంటే!

By:  Tupaki Desk   |   30 July 2015 9:30 AM GMT
అదే మ‌రి... మ‌హేష్ క్రేజ్ అంటే!
X
అంద‌రు హీరోల్లాగా ఇంకా త‌న మార్కెట్‌ ని ఇత‌ర భాష‌లకి విస్త‌రించ‌లేదు మ‌హేష్‌. అప్పుడ‌ప్పుడు త‌మిళంలోనే మ‌హేష్ సినిమాల్ని డ‌బ్బింగ్ చేస్తుంటారంతే. అయినా స‌రే... తెలుగు సినిమాల్లో న‌టించే మ‌హేష్ గురించి బాలీవుడ్ జ‌నాలు కూడా మాట్లాడుకుంటుంటారు. అందుకే నేష‌న‌ల్ లెవెల్లో జ‌రిపే కొన్ని స‌ర్వేల్లోనూ మ‌హేష్ మోస్ట్ డిజైర‌బుల్ హీరోగా ఎంపికవుతుంటాడు. రీజిన‌ల్ స్థాయి హీరో గురించి ఇలా నేష‌న‌ల్ లెవెల్లో మాట్లాడుకొంటుంటారంటే విశేష‌మే క‌దా మ‌రి. ఆ అట్రాక్ష‌న్ వ‌ల్లే మహేష్ సినిమాలు హిందీలో డ‌బ్ అవుతూ టీవీల్లో తెగ ఆడేస్తుంటాయి. నేష‌న‌ల్ ఛానెళ్ల‌లో హిందీ హీరోల చిత్రాల‌కి స‌మానంగా మ‌హేష్ సినిమాల్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. నేష‌న‌ల్ ఛాన‌ళ్లు మ‌హేష్ సినిమాల శాటిలైట్ రైట్స్ కోసం పోటీ ప‌డుతుంటాయి. భారీ ధ‌ర‌కు కొనుగోలు చేస్తుంటాయి.

మ‌హేష్ తాజా చిత్రం `శ్రీమంతుడు`కి కూడా హిందీ శాటిలైట్ మార్కెట్‌ లో మంచి రేటు ల‌భించింది. రూః 5కోట్ల‌కు జీ ఛాన‌ల్ హ‌క్కులు కొనింది. అదే సంస్థ తెలుగు రైట్స్ కోసం రూ: 12కోట్లు ఇచ్చింది. అంటే శాటిలైట్‌ కే 17కోట్లు వ‌చ్చిన‌ట్టు లెక్క‌. శ్రీమంతుడు త‌మిళంలోనూ డ‌బ్ అవుతోంది కాబ‌ట్టి అక్క‌డ కూడా ఎంతోకొంత మొత్తం వ‌స్తుంది. చూస్తుంటే మ‌హేష్ శ్రీమంతుడు శాటిలైట్ మార్కెట్లోనే రూః 20కోట్లు వ‌సూలు చేసేలా క‌నిపిస్తోంది. వంద‌ల కోట్ల‌తో తీసిన `బాహుబ‌లి`లాంటి సినిమాకి కూడా ఇదే స్థాయిలోనే శాటిలైట్ ధ‌ర ల‌భించిందని మాట్లాడుకొన్నారు. మ‌రి ఆ లెక్క‌లో చూస్తే `శ్రీమంతుడు` చాలా బెట‌ర్ అని చెప్పాలి. రూః 50కోట్ల‌ లోపే ఈ సినిమా పూర్త‌యింది. పెట్టిన పెట్టుబ‌డంతా ఎలాంటి టెన్ష‌న్ లేకుండా నిర్మాత‌ల‌కు అంద‌నుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లుగ‌డుతున్నాయి. ఇప్ప‌టికే అన్ని ఏరియాల్లోనూ సినిమాకి మంచి బిజినెస్ అయ్యింది. ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్ నెల‌కొంది కాబ‌ట్టి ఓపెనింగ్స్ కూడా భారీగానే వ‌స్తాయి. `మిర్చి` ఫేమ్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగ‌స్టు 7న ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది.