Begin typing your search above and press return to search.

శ్రీ‌మంతుడు పైర‌సీ.. కార్పొరెట్ కాలేజ్‌ లో

By:  Tupaki Desk   |   5 Sep 2015 8:17 AM GMT
శ్రీ‌మంతుడు పైర‌సీ.. కార్పొరెట్ కాలేజ్‌ లో
X
మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శ్రీ‌మంతుడు రిలీజై బంప‌ర్ హిట్ కొట్టింది. బాహుబ‌లి త‌ర్వాత దిబెస్ట్ క‌లెక్ష‌న్ల‌తో టాప్‌2లో నిలిచింది. 150 కోట్ల రికార్డ్ క‌లెక్ష‌న్ల‌తో అధార‌ణ విజ‌యం సాధించింది. ఇలాంటి జోన‌ర్‌లో ఓ ప్రాంతీయ సినిమాకి ఇదో రికార్డ్‌. అయితే ఇంత విజ‌యం సాధించింది కాబ‌ట్టి ఈ సినిమా పైర‌సీ కాలేదా? అన్న సందేహాలు రావొచ్చు. ఎప్ప‌టిలానే య‌థావిధిగా ఈ సినిమా పైర‌సీ మొద‌టి వారంలోనే బైటికొచ్చేసింది. బైట సీడీలు కుప్ప‌లు తెప్ప‌లుగా అమ్మేశారు.

ఏపీ రాజ‌ధాని న‌గ‌రం విజ‌య‌వాడ‌లోని ఒక కార్పొరెట్ కాలేజ్‌లో అయితే ఏకంగా పైర‌సీ సీడీ పెట్టి సినిమా వేసి స్టూడెంట్స్‌ కి చూపించారు. అందుకు సాక్షాత్తూ ఆ కాలేజ్ యాజ‌మాన్యమే సాక్షి. యాజ‌మాన్యం ఆజ్ఞ మేర‌కే ఇలా పైర‌సీ సీడీలో సినిమా వేసి చూపించార‌క్క‌డ‌. ఇది దారుణం.. ల‌క్ష‌ల్లో ఫీజులు ముక్కు పిండి వ‌సూలు చేసే స‌ద‌రు కాలేజ్ ఇలా పైర‌సీలో సినిమా చూపించ‌డం దారుణం. పైర‌సీ లేక‌పోతే మ‌న తెలుగు సినిమా ఖ్యాతి రెట్టింపు అయ్యేది. లాభాలు పెరిగి టాలీవుడ్ రెట్టింపు అయ్యి ఉండేదే. కానీ అందుకు పైరేట్‌లు తూట్లు పొడుస్తున్నారు. తెలుగు సినిమాని నిలువునా ముంచేస్తున్నారు.

ఇలా జ‌ర‌గ‌కుండా రాజ‌మౌళి - డి.సురేష్‌ బాబు - దిల్‌రాజు అంత‌టి దిగ్గ‌జాలే ఏమీ చేయ‌లేక‌పోతున్నారు. ఒక‌వేళ ఇలాంటి కార్పొరెట్ కాలేజ్‌ల‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని, అక్క‌డ ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌నీసం మొబైల్‌లో అయినా వీడియో షూట్ చేసి ఆన్‌ లైన్‌లో పెట్టి ఇక ముందు అలా చేయ‌కుండా ముకుతాడు వేస్తే బావుండేది.