Begin typing your search above and press return to search.

శ్రీమంతుడు ప్రి క్లైమాక్స్ లో ఏముంది?

By:  Tupaki Desk   |   3 Aug 2015 11:44 AM GMT
శ్రీమంతుడు ప్రి క్లైమాక్స్ లో ఏముంది?
X
కొత్తగా ట్రై చేద్దామని చూస్తే ‘1 నేనొక్కడినే’ ప్రేక్షకులకు రుచించలేదు. రొటీన్ కమర్షియల్ బాటలోనే వెళ్దామని ‘ఆగడు’ చేస్తే దాన్ని మరీ దారుణంగా తిప్పికొట్టారు ఆడియన్స్. దీంతో ఈసారి బాగా గ్యాప్ తీసుకుని.. ‘శ్రీమంతుడు’ చేశాడు మహేష్. ఈ సినిమా కొత్తగానే ఉంటుందని.. కానీ కమర్షియల్ రుచులకేమీ లోటుండదని చెబుతున్నాడు.

ఇంటిల్లిపాదీ కలిసి చూసే ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ‘శ్రీమంతుడు’లో ఉన్నాయని.. ఈసారి మాత్రం అభిమానుల్ని నిరాశ పరచనని నమ్మకంగా చెబుతున్నాడు మహేష్. ఇంతకీ సినిమాలో మీకు బాగా నచ్చిన పార్ట్ ఏదంటే ప్రి క్లైమాక్స్ అని సమాధానమిచ్చాడు మహేష్. డైరెక్టర్ కొరటాల శివ కూడా ఇంటర్వ్యూల్లో ప్రి క్లైమాక్స్ గురించే మాట్లాడాడు. యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కూడా ప్రి క్లైమాక్సే హైలైట్ అంటున్నారు.

మరి అంతగా ఏముందా ప్రి క్లైమాక్స్ లో అన్న చర్చ మొదలైంది అభిమానుల్లో. మామూలుగా ఇంటర్వెల్ బ్యాంగ్ గురించో.. క్లైమాక్స్ గురించో మాట్లాడతారు. కానీ ఇక్కడ పదే పదే ప్రి క్లైమాక్స్ గురించే ప్రస్తావిస్తున్నారు. అంటే అందులో కచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. సినిమాలో ఎమోషన్స్ కు పెద్ద పీట వేసినట్లు చెబుతున్నారు కాబట్టి.. ఎమోషన్ ను పీక్స్ కు తీసుకెళ్లే సీన్ ఏదో ఒకటి ఇక్కడ పడి ఉంటుంది. తనకు సవాలుగా నిలిచిన పాత్ర ఇదని మహేష్ చెప్పాడు కాబట్టి.. అతడి పెర్ఫామెన్స్ కూడా ఈ సీన్లో నే పీక్స్ లో ఉండొచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇంకో నాలుగు రోజులు ఓపిక పడితే.. ఈ సస్పెన్స్ కు తెరపడి పోతుంది.