Begin typing your search above and press return to search.

అదరగొడుతున్న శ్రీమంతుడు ట్యూన్స్

By:  Tupaki Desk   |   29 July 2015 2:28 PM GMT
అదరగొడుతున్న శ్రీమంతుడు ట్యూన్స్
X
దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చాడంటే... ఆల్బమ్‌ లో ఏదో ఒక పాట టాప్ సాంగ్స్ జాబితాలో ఉంటుంది. సాధారణంగా ఫోక్ సాంగ్స్, ఐటెమ్ నెంబర్స్‌ కి అదిరిపోయే ట్యూన్స్ ఇస్తాడు డీఎస్‌ పీ. సినిమాపై అంచనాలు పెంచేయడంతో పాటు...పాటలతోనే సగం హిట్ అనిపించడంలో దిట్ట దేవిశ్రీ. ఆగస్ట్ 7న విడుదల కానున్న ప్రిన్స్ మహేష్ బాబు మూవీ... శ్రీమంతుడు మ్యూజిక్‌ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

శ్రీమంతుడు మూవీ కోసం చేసిన మెలోడీస్ విషయంలో కూడా తన మ్యూజిక్‌ తో మ్యాజిక్ చేసేశాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఉన్నా... మెల్లగా జనాలకు ఎక్కేస్తున్నాయి ఈ ట్యూన్స్. యాపిల్ మ్యూజిక్ స్టోర్ అయిన ఐట్యూన్స్‌ లో... శ్రీమంతుడు ట్యూన్స్ ఛార్ట్ టాపర్స్‌ గా దూసుకుపోతున్నాయి. శ్రీమంతుడు రిలీజ్‌ కి ఇంకా వారంపైగా టైం ఉంది. ఈలోగా ప్రచారం ఎలాగూ ఊపందుకుంటుంది. మరోవైపు నుంచి సాంగ్స్ పరంగా టాక్ ఊపందుకుంటోంది.

ఇక మహేష్ రంగంలోకి దిగి ప్రమోషన్ మొదలుపెడితే... శ్రీమంతుడిని ఆపడం ఎవరి తరం కాదు. బాహుబలి మేనియాలోంచి జనాలు మెల్లగా బయటకు వస్తున్న టైంలో... క్లాస్‌ గా కనిపిస్తున్న... మహేష్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌ టైనర్ శ్రీమంతుడు క్రియేట్ చేయబోతున్న సెన్సేషన్స్‌ పై... సెలబ్రేషన్స్‌ కి ఫ్యాన్స్ రెడీ అయిపోవచ్చు.