Begin typing your search above and press return to search.

శ్రీకాంత్ ఎన‌ర్జీ సీక్రెట్ దెయ్య‌మా?

By:  Tupaki Desk   |   25 May 2016 10:30 PM GMT
శ్రీకాంత్ ఎన‌ర్జీ సీక్రెట్ దెయ్య‌మా?
X
సినిమాల‌కి పేర్లు పెట్ట‌డంలో అస‌లు సిస‌లు క్రియేటివిటీని ప్ర‌ద‌ర్శిస్తున్నారు డైరెక్ట‌ర్లు. పోస్ట‌ర్ చూడ‌గానే ప్రేక్ష‌కులు థియేట‌ర్‌ కి ప‌రిగెత్తుకొంటూ వ‌చ్చేయాల‌న్న‌ట్టుగా ఎట్రాక్టివ్ టైటిల్స్‌ ని పెట్టేస్తున్నారు. ఆ రేంజ్‌ లో కంటెంట్‌ పై కూడా దృష్టిపెడితే అద్భుతాలు చోటు చేసుకొంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రి ఆ దిశ‌గా ఎప్పుడు దృష్టిసారిస్తారో చూడాలి. ఇక ఈ టైటిల్స్ ప్ర‌స్థావ‌న ఇప్పుడెందుకొచ్చిందంటే శ్రీకాంత్ సినిమాకి వెరైటీ టైటిల్ సెట్ట‌వ్వ‌డం.

`ఘోస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎన‌ర్జీ` అనేది శ్రీకాంత్ సినిమా పేరు. అరె, ఇదేం పేరంటారా? ఇప్పుడంతా థ్రిల్ల‌ర్ సినిమాల హ‌వా క‌దండీ. అందుకే ప్ర‌తీ క‌థ‌లోకీ దెయ్యం చొర‌బ‌డుతోంది. ఇప్పుడు శ్రీకాంత్ కూడా ఓ దెయ్యం క‌థ‌లోనే న‌టిస్తున్నాడ‌న్న‌మాట‌. ఆ సినిమాని అమ్మ రాజ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. కొరియోగ్రాఫ‌ర్ అయిన అమ్మ రాజ‌శేఖ‌ర్ ర‌ణం చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఆ త‌ర్వాత ఆ రేంజ్‌ లో మ‌రో సినిమా తీయ‌లేక‌పోయాడు. ఇప్పుడు శ్రీకాంత్‌తో ఓ థ్రిల్ల‌ర్ సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఆ సినిమాకోసం తన క్రియేటివిటీనంతా ఉప‌యోగించి `ఘోస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎన‌ర్జీ` అని పేరు పెట్టాడు. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికీ చివ‌రి ద‌శ‌కు చేరుకొంద‌ట‌. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించాడు అమ్మ రాజశేఖ‌ర్‌.