Begin typing your search above and press return to search.

మరోసారి విలన్ గా శ్రీకాంత్.. కానీ!!

By:  Tupaki Desk   |   6 Oct 2017 6:51 AM GMT
మరోసారి విలన్ గా శ్రీకాంత్.. కానీ!!
X
మొదట నెగిటివ్ క్యారెక్టర్లు.. తర్వాత ఫ్యామిలీ హీరో.. మధ్య మధ్యలో యాక్షన్ మూవీస్.. కొన్ని రోజులుగా క్యారెక్టర్ పాత్రలు.. ఇప్పుడు మళ్లీ విలన్ గా కొత్త అవతారం. వందకు పైగా సినిమాల్లో హీరోగా నటించిన శ్రీకాంత్ కెరీర్ తీరు ఇది. నాగచైతన్య రీసెంట్ మూవీ యుద్ధం శరణం లో విలన్ గా నటించి మెప్పించాడు శ్రీకాంత్. ఆ చిత్రం ఫెయిల్ కావడం నిరుత్సాహకరమే అయినా.. మూవీ హైలైట్స్ లో శ్రీకాంత్ విలనిజం ఒకటిగా నిలవడం ఒక్కటే ఊరట.

ఇప్పుడు మరో సినిమాలో కీలక పాత్ర చేసేందుకు శ్రీకాంత్ ఒప్పుకున్నాడని ప్రకటన వచ్చింది. అభయ్ హీరోగా.. జైరాజు సింగ్ దర్శకత్వంలో శ్రీకాంత్ నటిస్తున్నట్లు.. నిర్మాణ సంస్థ ఏపీఎల్ ప్రొడక్షన్స్ వర్గాలు ప్రకటించాయి. ఇది విలన్ రోల్ అని పైకి చెప్పలేదు కానీ.. శ్రీకాంత్ చేస్తున్నది ప్రతినాయకుడి పాత్రే అని తెలుస్తోంది. మెడికల్ థ్రిల్లర్ జోనర్ లో ఈ స్టోరీ తెరకెక్కనుండగా.. దర్శకుడు తన పాత్ర మలిచిన తీరు నచ్చి.. ఈ సినిమా ఒప్పుకున్నానని చెబుతున్నాడు శ్రీకాంత్. ఒక ఫెయిల్యూర్ తర్వాత.. విలన్ గా మళ్లీ రీ బౌన్స్ అయేందుకు.. పెద్ద సినిమా ఏదైనా చేస్తాడని అనుకుంటున్న సమయంలో.. ఇలా ఓ చిన్న సినిమాని ఒప్పుకోవడం ఆశ్చర్యకరమే. అనేక చిన్న సినిమాల్లో నటించి.. సక్సెస్ లతో వాటిని పెద్ద స్థాయికి తీసుకెళ్లిన శ్రీకాంత్ కు ఇందులో తప్పేమీ కనిపించకపోవచ్చు.

అయితే.. శ్రీకాంత్ సమకాలికుడు అయిన జగపతిబాబు.. అటు విలన్ గాను ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటిస్తున్న మూవీస్ ని గమనిస్తే.. అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలు.. పెద్ద హీరోల సినిమాలే కనిపిస్తాయి. అందుకే కోట్లాది రూపాయలను రెమ్యూనరేషన్ రూపంలో అందుకుంటున్నాడు. తను హీరోగా ఇన్నేళ్లలో కూడా ఇంత సంపాదించలేదని ఓ సమయంలో జేబీ చెప్పాడంటే.. కెరీర్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. కానీ విలన్ గా కంటిన్యూ అవాలని ఫిక్స్ అయిన తర్వాత.. శ్రీకాంత్ ప్లానింగ్ లో మాత్రం లోపాలు కనిపిస్తున్నాయని సన్నిహితులు అంటున్నారు. ఒక్క పెద్ద సినిమాలో సరైన పాత్ర పడితే.. శ్రీకాంత్ రేంజ్ మారిపోతుందని చెబుతున్నారు.