Begin typing your search above and press return to search.

అనుబంధాలే నా బలం!!

By:  Tupaki Desk   |   20 Oct 2017 9:48 AM GMT
అనుబంధాలే నా బలం!!
X
ఏ దర్శకుడైనా ఎలాంటి కథలు రాసుకున్నా ఎపుడో ఒకప్పుడు తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని నిజాలను తెరపై చక్కగా చూపించాలని అనుకుంటాడు. దేశ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కో తరహా శైలి ఉంది. అటువంటి వారే సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా అలా గుర్తిండిపోతారు. కొత్త బంగారు లోకం - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

అనుబంధాలు ఆత్మీయతలే ఆయన సినిమాలోని ప్రధాన అంశాలు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈ దర్శకుడు తన జీవితం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపాడు. మా ఊరు రేలంగి. నేను చిన్నప్పటి నుండి పుస్తకాలు బాగా చదివేవాన్ని . స్నేహితులతో చిన్నప్పుడు ఊరిలో చాలా తీరిగేవాన్ని ఇప్పటికి కూడా ఊరికి వెళ్ళినపుడు బైక్ పై అలా ఓ రౌండ్ వేసి వస్తాను. నా బందువులే నాకు బలం. ఆత్మీయతలే నాకు శక్తి. అల్లరి పనులను కూడా బాగా చేసేవాన్ని. థర్డ్ క్లాస్ లో మా ఊరి బ్యాంక్ మేనేజర్ గారి పాపకు తరచు ఓ గులాబీ పువ్వు ఇచ్చేవాడిని. ఓ రోజు మా క్లాస్ టీచర్ చూసి నన్ను కొట్టింది. ఆ నెక్స్ట్ డే నుంచి టీచర్ కి కూడా పువ్వు ఇచ్చేవాడిని.

కాలేజ్ లో కూడా నాది అల్లరి క్యారెక్టర్. చిన్నపుడు మా అమ్మ సప్తపది - ప్రతిఘటన లాంటి సినిమా కథలు చెప్పేది. అప్పుడెనేమో నా మీద సినిమాల ప్రభావం పడింది. ఇక మా ఊళ్లో నాటకరంగం వంటి కార్యక్రమాలు జరిగినపుడు నేనే కథ రాసి దర్శకత్వం వహించేవాన్ని. అప్పుడు నా దర్శకత్వం తొలి అడుగు. డిగ్రీ వరకు నాలోని దర్శకత్వ లక్షణాలను పెంచుకున్నా. కదిర్ తెరకెక్కించిన హృదయం - ప్రేమదేశం సినిమాలు నాపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అప్పుడే డిసైడ్ అయ్యాను ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలని. అసలైతే ఐఎఎస్ కావాలని నాన్నగారు ఆశపడ్డారు. కానీ ఎంటెక్ చదివిన తర్వాత సినిమాల్లో రాణించాలని హైదరాబాద్ చేరుకున్న. మా అన్నయ్య నాకు ఎంతో సపోర్ట్ చేశారు. చిన్నాన్న గారి సహాయంతో సింధూరపువ్వు’ దర్శకుడు కృష్ణారెడ్డిగారికి పరిచయం అయ్యాను. వారి తమ్ముడు బి.మధు 'ఠాగూర్' సినిమా నిర్మిస్తున్నప్పుడు ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను. కో–డైరెక్టర్ రెడ్డితరణీరావుతో పరిచయం పెరగడంతో ఆయన సహాయంతో దిల్ రాజు గారి ఆర్య - బొమ్మరిల్లు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను.

ఆ తర్వాత నేను రాసిన కొత్త బంగారు లోకం స్టోరీ దిల్ రాజు గారికి చెప్పడంతో ఆయనకు బాగా నచ్చింది. 2008లో విడుదలైన ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. నాకు అవార్డులతో పాటు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2011 లో ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నా. నాకు ఒక పాప కూడా ఉంది. నా బలం నా భార్య. ఇక కొత్త బంగారు లోకం నుంచి చలమల శెట్టి కిషోర్ నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. అతను శరీరం అయితే నేను ఆత్మ. అలాగే అతను ఆత్మ అయితే నేను శరీరం. దాసరి చిత్రాలంటే చాలా ఇష్టం. మధ్య తరగతి జీవితాల్ని ఆయన చక్కగా చూపిస్తారు.

నేను సినిమాలో అనుబంధాలు ఆత్మీయతలు ఎక్కువగా ఉండాలని చూసుకుంటాను. అంతే కాకుండా నన్ను ఒక ప్రేక్షకుడిగా భావిస్తాను. నా సినిమాలు కుటుంబం అంతా వచ్చి చూడాలి అనుకుంటా. ఆలోచింప జేసే డైలాగ్స్ రాసుకుంటాను. క్వాలిటీ ఆఫ్ లైఫ్ నా ఫార్ములా. లైఫ్ కంటే ఈ ప్రపంచంలో ఏది గొప్పది కాదు. అదే విధంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో బంధాల గురించి చెప్పాను. నాణ్యతా ప్రమాణాలతో కూడిన జీవితాన్ని వినోదాత్మకంగా విభిన్నంగా చూపించి ప్రేక్షకుల్ని ఆలోచింపజేయడమే నా టార్గెట్.