Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ముద్దుగుమ్మ ముదిరినా అందమే

By:  Tupaki Desk   |   1 Dec 2015 11:30 AM GMT
ఫోటో స్టోరి: ముద్దుగుమ్మ ముదిరినా అందమే
X
చక్కనమ్మ చిక్కినా అందమే.. అలాగే ముద్దుగుమ్మ ముదిరినా అందమే. సాధారణంగా అయితే.. భామలు ముదిరేసరికి మొహం మొత్తేస్తారు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఎంత ఏజ్ మీద పడ్డా మెరిసిపోతూనే ఉంటారు. అందాల తార శ్రీదేవి ఇందుకు మినహాయింపేమీ కాదు. మామూలుగానే ఈవిడ అందాల తార.

అలాంటింది ఆమెను మరింత అందంగా చూపించాలని మనసు పెట్టి ఫోటోగ్రాఫర్ ప్రయత్నించాడనుకోండి. అప్పుడెలా ఉంటుంది. దీనికి శ్రీదేవి కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని వయ్యారాలు, వయసు మీద పడ్డ సొగసులను నయగారంగా ఒలకబోస్తే.. ఇక ఆ అందాలను చూడాలనే ఆరాటం.. అభిమానులు మరింతగా పెరిగిపోతుంది. తాజా ల అఫీషియల్ అనే మేగజైన్ కవర్ పేజ్ కి ఎక్కేసింది శ్రీదేవి. కవర్ పేజ్ పై ఉన్న నీలి రంగు డ్రస్ లోనే అద్భుతంగా ఉందంటే.. ఇక లోపలి చిత్రాల్లో అయితే.. చిత్రవిచిత్రాలను అన్నిటినీ చూపించేసింది.

యాభైకి దగ్గర పడ్డా తనలో స్పీడ్ కానీ, తన అందంలో కానీ ఏమాత్రం సొగసులు కానీ ఏ మాత్రం తగ్గలేని ప్రూవ్ చేసేసింది శ్రీదేవి. ది లాస్ట్ ఎంప్రెస్ అంటూ.. ఆఖరి మహారాణి పేరుతో మేగజైన్ ఇచ్చిన పేరు ఈ ముదురు భామకి అతికినట్లుగా సరిపోతుందని చెప్పచ్చు. ఇక తన స్థాయిని ఎన్నో రెట్లు పెంచుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న.. తమిళ పులి నిరాశ పరిచినా.. రెట్టింపు స్పీడ్ తో దండెత్తనుంది ఈ అందాల తార.