Begin typing your search above and press return to search.

అందాల తార గోల్డెన్ జూబిలీకి రెడీనా!!

By:  Tupaki Desk   |   21 Dec 2016 1:30 PM GMT
అందాల తార గోల్డెన్ జూబిలీకి రెడీనా!!
X
అందాల తార శ్రీదేవి ఎప్పుడూ సెన్సేషనే. టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్నపుడే కాదు రీఎంట్రీ లోను అదరగొట్టేసింది. దక్షిణాదిలో కూడా గ్రాండ్ ఎంట్రీ ఇద్దామన్న ఆలోచన విఫలం అయినా.. శ్రీదేవి క్రేజ్ కి వచ్చిన లోటు ఏమీ ఉండదు. కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన ఈ అందాలతార.. తన జీవితంలో ఓ అరుదైన వేడుకను జరుపుకోబోతోంది.

సినిమా ఇండస్ట్రీలో గోల్డెన్ జూబ్లీ.. అంటే 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం అందరికీ సాధ్యం అయ్యే విషయం కాదు. కానీ శ్రీదేవి ఈ అరుదైన ఫీట్ సాధించబోతోంది. 2017 శ్రీదేవి కెరీర్ లో చాలా ముఖ్యం. ఆ ఏడాదితో శ్రీదేవి కెరీర్ అరంగేట్రం చేసి 50 వసంతాలు పూర్తి కానుండడమే అసలు కారణం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భర్త బోనీ కపూర్ గ్రాండ్ లెవెల్ లో వేడుకను జరుపబోతున్నాడట. 1967లో 'కాంధాన్ కరుణాయ్' అనే తమిళ్ మూవీతో శ్రీదేవి తెరంగేట్రం చేసింది.

అప్పుడు ఆమె వయసు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. ఆ సినిమాలో "మురుగ"(కుమార స్వామి)పాత్రను పోషించింది శ్రీదేవి. మొదటి సినిమాలోనే శివాజీ గణేషన్.. జయలలిత.. కేఆర్ విజయ వంటి దిగ్గజాలతో నటించే అరుదైన అవకాశం ఆమెకు చిక్కింది. ప్రస్తుతం శ్రీదేవి నటించిన మామ్ చిత్రాన్ని 2017లో ఆమె గోల్డెన్ జూబ్లీ సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు శ్రీదేవి భర్త బోనీ కపూర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/