మామ్ రిలీజ్ డేట్ తో శ్రీదేవి కనెక్షన్

Sun May 14 2017 10:58:15 GMT+0530 (IST)

అలనాటి అందాల తార శ్రీదేవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మామ్. ఈ చిత్రానికి చాలానే స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇంగ్లీష్ వింగ్లిష్ తో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. బాహుబలిలో శివగామి పాత్రను మిస్ అయిన శ్రీదేవి.. మామ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు శ్రీదేవి కెరీర్ తో ఓ స్పెషల్ లింక్ ఉంది. 

శ్రీదేవి నటిస్తున్న 300వ చిత్రం ఈ మామ్. అసలీ సినిమాని ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని భావించారు. దాదాపు వర్క్ అంతా ఫినిష్ అయిపోయినా.. రిలీజ్ డేట్ ను జూలై 14కు వాయిదా వేశారు. మళ్లీ జూలై 7నే విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ డేట్ కి శ్రీదేవికి స్పెషల్ లింక్ ఉండడమే ఇందుకు కారణం. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం.. అంటే 1967 జూలై 7న శ్రీదేవి తొలిసారిగా కెమేరా ముందు నటించింది. అప్పుడు ఆమె వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. ఎంఏ తిరుమగమ్ దర్శకత్వంలో రూపొందిన తునైవన్ చిత్రంలో తొలిసారిగా నటించింది శ్రీదేవి. శ్రీదేవి నటించిన మొదటి సీన్ ను జూలై 7నే చిత్రీకరించారు. విచిత్రంగా రిలీజ్ డేట్ కూడా జూలైలోనేకావడం విశేషం. 1969 జూలై4న ఈ సినిమా రిలీజ్ అయింది.  

జూలై 7తో శ్రీదేవికి గల ఈ స్పెషల్ లింక్ కారణంగా.. అదే రోజున మామ్ చిత్రాన్ని విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు శ్రీదేవి భర్త.. మామ్ నిర్మాత బోనీ కపూర్. మామ్ చిత్రాన్ని హిందీతోపాటు తెలుగు.. తమిళ్.. మలయాళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు

TAGS: