Begin typing your search above and press return to search.

ఆ త‌మిళ ద‌ర్శ‌కుడిపై శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   12 July 2018 5:33 AM GMT
ఆ త‌మిళ ద‌ర్శ‌కుడిపై శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్!
X
టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై నిర‌స‌న‌లు - ఆందోళ‌న‌లు చేప‌ట్టిన న‌టి శ్రీ‌రెడ్డి కొద్ది రోజులుగా త‌న ఫేస్ బుక్ ఖాతాకే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. కొంత‌మంది టాలీవుడ్ ప్ర‌ముఖుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి...తాజాగా మ‌రోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్ పైనే విమ‌ర్శ‌లు గుప్పించిన శ్రీ‌రెడ్డి....తాజాగా కోలీవుడ్ ను టార్గెట్ చేసింది. ఇక త‌మిళి సినీ ఇండ‌స్ట్రీ గుట్టుర‌ట్టు చేసే స‌మ‌యం వ‌చ్చింద‌ని శ్రీ‌రెడ్డి త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగదాస్ పై శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని మురుగదాస్‌ మాటిచ్చి మోసం చేశార‌ని శ్రీరెడ్డి ఆరోపించింది. మురుగ‌దాస్ పై శ్రీ‌రెడ్డి త‌న ఫేస్‌బుక్ పేజీలో పెట్టిన‌ సంచ‌ల‌న పోస్ట్ ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

‘హాయ్‌ తమిళ్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ జీ.. ఎలా ఉన్నారు? మీకు గ్రీన్‌ పార్క్‌ హోటల్‌ గుర్తుందా?.....వెలిగొండ శ్రీనివాస్‌ ద్వారా మనం క‌లిశాం. ఆ త‌ర్వాత మ‌నం చాలా చేశాం....మీ సినిమాల్లో నాకు అవకాశం ఇస్తానని ప్రామిస్‌ చేశారు.......కానీ ఇంతవరకు మీరు నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. మీరు కూడా గొప్పవారే సర్‌’ అని శ్రీ‌రెడ్డి పోస్ట్ చేసింది. మురుగుదాస్ పై శ్రీ‌రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల పోస్ట్ ...సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అయితే, ఇప్ప‌టిదాకా టాలీవుడ్ ను టార్గెట్ చేసిన శ్రీ‌రెడ్డి...ఇక‌పై త‌మిళ ఇండ‌స్ట్రీని టార్గెట్ చేయ‌బోతున్నాన‌ని కూడా పోస్ట్ చేసింది. శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారం చూస్తుంటే....త్వ‌ర‌లో మ‌రింత‌మంది కోలీవుడ్ హీరోల‌పై కూడా షాకింగ్ కామెంట్స్ చేసేలా ఉంది. మ‌రి, శ్రీ‌రెడ్డి `అర‌వ ` ఎపిసోడ్ ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో వేచి చూడాలి.