Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ సినిమా నేరుగా ఆన్ లైన్లో..

By:  Tupaki Desk   |   29 May 2016 4:14 AM GMT
సూపర్ స్టార్ సినిమా నేరుగా ఆన్ లైన్లో..
X
సూపర్ స్టార్ కృష్ణ చాలా ఏళ్ల తర్వాత ముఖానికి రంగేసుకుని.. ‘శ్రీ శ్రీ’గా రాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 3న రిలీజ్ డేట్ కూడా కన్ఫమ్ అయిపోయింది. ఐతే ఆడియో వేడుక జరిగినపుడు ఈ సినిమా మీద కాస్త ఆసక్తి నెలకొంది కానీ.. ఆ తర్వాత జనాలు దీని గురించి పూర్తిగా మరిచిపోయారు. ఇప్పుడు ఉన్నట్లుండి ఏ పబ్లిసిటీ లేకుండా సినిమాను రిలీజ్ చేసేస్తున్నారు. పైగా ముందు రోజు ‘అ..ఆ’ లాంటి క్రేజీ మూవీ థియేటర్లో దిగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణ సినిమాను జనాలు ఏమాత్రం పట్టించుకుంటారో చూడాలి. ఈ సినిమాతో సూపర్ స్టార్ ఓ రికార్డు సృష్టించబోతున్నట్లు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ప్రకటించారు నిర్మాతలు.

అమెరికాలో ఈ చిత్రాన్ని నేరుగా ఆన్ లైన్లో రిలీజ్ చేయబోతున్నారట. ఇలా నేరుగా ఆన్ లైన్లో రిలీజవ్వబోతున్న తొలి తెలుగు సినిమా ఇదే అంటున్నారు. తెలుగు సినిమాకు అనేకరకాలైన కొత్త టెక్నాలజీల్ని పరిచయం చేసిన ఈ వయసులో కూడా ఇలా కొత్త సాంకేతికతకు తెరతీయడం గ్రేట్ అంటోంది చిత్ర యూనిట్. ఐతే అమెరికాలో ఈ సినిమాకు స్క్రీన్లు దొరక్కే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లున్నారు. ఆ సంగతి పక్కనబెట్టేస్తే కృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఆయన్ని మళ్లీ వెండి తెరపై చూసుకోడం సూపర్ స్టార్ వీరాభిమానులకు సంతోషాన్నిచ్చే విషక్ష్మే. ఓ మరాఠీ సినిమాకు రీమేక్ గా వస్తున్న ‘శ్రీ శ్రీ’ ఓ రివెంజ్ స్టోరీ నేపథ్యంలో సాగుతుంది. సీనియర్ డైరెక్టర్ ముప్పలనేని శివ దర్శకత్వం వహించాడు.