శ్రీరెడ్డి కాదు.. ఇకపై శ్రీ శక్తి!

Sun Apr 15 2018 15:26:06 GMT+0530 (IST)

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఇష్యూను కూడా నాలుగైదు రోజులు.. లేదంటే రెండు వారాలు మాత్రమే హెడ్ లైన్స్ లో ఉండగలదు. ఎంత పెద్ద ఇష్యూ అయినా.. మీడియా ప్రయారిటీ మార్చేస్తుంటుంది. కానీ.. ఇందుకు భిన్నంగా టాలీవుడ్ నటి శ్రీరెడ్డి వ్యవహారం మాత్రం ఇందుకు మినహాయింపుగా చెప్పాలి.టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ మీదా.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం మీద పోరాడుతున్న శ్రీరెడ్డి.. ఏ రోజుకు ఆ రోజు కొత్త కొత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీడియాలో లైవ్ లో ఉంటున్నారు. శ్రీరెడ్డి వ్యవహారం మొదట్నించి టీవీ ఛానల్స్ లోనూ.. వెబ్ సైట్లలోనూ.. డిజిటల్ మీడియంలోనూ టాప్ లో ఉంది. అదే సమయంలో ప్రింట్ మీడియాలో మాత్రం సింగిల్ కాలమ్.. లేదంటే డీసీ వరకే పరిమితమయ్యారు.

ఆమె పోరాటానికి మా కూడా కాస్త తగ్గటంతో శ్రీరెడ్డి ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో నిర్ణయాల మీద నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. నెమ్మదిగా ఆమె బలం అంతకంతకూ పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆసక్తికరమైన నిర్ణయాన్ని ఆమె ప్రకటించారు. ఈ రోజు నుంచి తన పేరును శ్రీరెడ్డి నుంచి శ్రీ శక్తిగా మార్చుకుంటున్నట్లు ఆమె చెప్పారు. తన పేరును మార్చుకోవటం వెనుక కారణం ఉందంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఈ పోరాటంలోకి వచ్చాక అన్నలంతా పిలిచేటప్పుడు శ్రీరెడ్డి అని పిలిచేవారని.. ఎవరికీ ఎలాంటి సమస్య లేకున్నా.. ఎవరికీ కులపరమైన భావనను దగ్గరకు రానివ్వకుండా కలుపుకుపోతున్నట్లు చెప్పారు. అయితే.. ఎవరైనా నీ పేరేంటి? అని అడిగినప్పుడు  శ్రీరెడ్డి అని చెప్పటానికి కాస్త ఇబ్బందిగా ఉందన్నారు.

అందరిని కలుపుకుపోయేటప్పుడు ఆ ఒక్క తోక వల్ల ఎదుటివారికి కొంచెం ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతోనే తాను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తన పేరును మార్చుకుంటున్నట్లు చెబుతూనే.. టాలీవుడ్ పరిశ్రమలో ప్రముఖ నిర్మాత.. సెలబ్రిటీ స్టేటస్ ఉన్న దిల్ రాజు పేరును ప్రస్తావించి మరో సంచలనానికి తెర తీశారు.

రెడ్డి అయినప్పటికీ దిల్ రాజు అన్ని థియేటర్స్ ను తన చేతిలో పెట్టేసుకొని ఎంతో మంది ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్న వేళ.. వాళ్లకు అండగా ఉండాలని అనుకోవటం లేదన్నారు. వాళ్ల మీద కూడా తన యుద్ధం ఉందని.. రెడ్లల్లో చాలా గొప్పవాళ్లు ఉన్నారని.. తనకెందుకో ఇబ్బందిగా అనిపించి పేరు మార్చుకుంటున్నట్లు వెల్లడించింది. అందరూ సూచించిన నేపథ్యంలో తన పేరును శ్రీశక్తిగా మార్చుకున్నట్లు పేర్కొన్నారు. పేరు మార్చుకుంటే మార్చుకున్నట్లు చెప్పటం వరకూ ఓకే. కానీ.. మధ్యలో దిల్ రాజు పేరును తీసుకురావటం ఏమిటి శ్రీరెడ్డి..? అదేనండి. .శ్రీశక్తి..!