Begin typing your search above and press return to search.

అవారాని వ‌ద‌లని బొమ్మాళీ

By:  Tupaki Desk   |   22 July 2018 6:55 AM GMT
అవారాని వ‌ద‌లని బొమ్మాళీ
X
దొరికిన‌వాళ్ల‌ను దొరికిన‌ట్టు ఆడుకుంటోంది శ్రీ‌రెడ్డి. శ్రీ‌లీక్స్ ఎపిసోడ్స్ ఇక అయిపోయాయిలే అనుకుంటున్న టైమ్‌ లో కోలీవుడ్ సిరీస్ మొద‌లైంది. అక్క‌డ కొత్త‌ ఎపిసోడ్స్‌ తో హ‌డ‌లెత్తిస్తోంది. అయితే దీనికి విశాల్ - కార్తీ న‌డిగ‌ర‌సంఘం త‌ర‌పున అడ్డుక‌ట్ట వేసేందుకు ట్రై చేస్తున్నారు. ఆర్టిస్టుల‌పై ఆరోపిస్తే ఏదైనా ప్రూఫ్ ఉంటే పోలీసుల ద‌గ్గ‌ర‌ నిరూపించుకో! అంటూ శ్రీ‌రెడ్డిపై స‌వాల్ విసిరారు కార్తీ. చ‌ర్య‌- ప్ర‌తిచ‌ర్య సిద్ధాంతం ప్ర‌కారం ప్ర‌స్తుతం కార్తీ-శ్రీ‌రెడ్డి మ‌ధ్య పెనుయుద్ధ‌మే సాగుతోందిపుడు. ఆవారా నిన్నొదల బొమ్మాళీ అంటూ శ్రీ‌రెడ్డి కార్తీ వెంట ప‌డుతోంది. అత‌డి మాట‌లు త‌న‌ని హ‌ర్ట్ చేశాయ‌ని శ్రీ‌రెడ్డి అంటోంది.

తాజా ఎపిసోడ్‌ ని అంత‌కంత‌కు లైన్ అండ్ లెంగ్త్ పెంచుతూనే ఉంది శ్రీ‌రెడ్డి. ప్ర‌స్తుతం ఈ లొల్లి న‌డిగ‌ర సంఘం వ‌ర‌కూ వెళ్లింది. చెన్న‌య్‌ లో ఉండి బ్యాటింగ్ స్టార్ట్ చేసిన‌ శ్రీ‌రెడ్డి తంబీల్ని వెంటాడుతున్న వైనంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తెలుగు బొమ్మాళీ తంబీల్నే అట‌కాయిస్తోందే.. మ‌హా గ‌డుస‌రి! అంటూ ఫిలింన‌గ‌ర్ వాసులు మాట్లాడుకుంటున్నారు. హైద‌రాబాద్‌ - చెన్న‌య్ వంటి మెట్రో న‌గ‌రాల నుంచి శ్రీ‌లీక్స్ వ్య‌వ‌హారం ముంబైకి పాకుతుందా? అంటూ చెణ‌కులు విసిరేస్తున్నారు. ప్ర‌స్తుతం యూత్ అంతా శ్రీ‌రెడ్డి ఫేస్‌ బుక్‌ ని అనుస‌రిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ఈ వార్త‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌త ద‌క్కుతోంది. అయితే హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు పోగొట్టుకున్న శ్రీ‌రెడ్డి - ప్ర‌స్తుతం కోలీవుడ్‌ లో అవ‌కాశాలు కోరుకుంటోందా? ఈ వివాదం వ‌ల్ల అది అక్క‌డ క‌లిసొస్తుందా? అన్న పాయింట్‌ పైనా చ‌ర్చ మొద‌లైంది. వ్వాట్ హ్యాపెనింగ్ ఇన్ శ్రీ లైఫ్‌ స్టోరి?