Begin typing your search above and press return to search.

శ్రీ‌రెడ్డి తాజా సంచ‌ల‌నం.. 'రెడ్డి డైరీ'!

By:  Tupaki Desk   |   21 Aug 2018 4:35 AM GMT
శ్రీ‌రెడ్డి తాజా సంచ‌ల‌నం.. రెడ్డి డైరీ!
X
త‌న మాట‌ల‌తో టాలీవుడ్‌.. కోలీవుడ్ ల‌ను ఒక కుదుపున‌కు గురి చేసిన క్రెడిట్ సినీ న‌టి శ్రీ‌రెడ్డికే ద‌క్కుతుంది. సినిమా ప‌రిశ్ర‌మ‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ త‌న మాట‌ల‌తో సంచ‌ల‌నం సృష్టించిన ఆమె.. కొన్ని ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసి సంచ‌ల‌నం సృష్టించారు.

టాలీవుడ్ లో శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో తెలిసిందే. ఇటీవ‌ల చెన్నై వెళ్లిన ఆమె.. కోలీవుడ్ కు చెందిన సినీ ప్ర‌ముఖులు ప‌లువురిపైన తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌కు అవ‌కాశాలు ఇస్తామ‌ని చెప్పి.. దారుణంగా మోసం చేశార‌న్నారు. ఇదిలా ఉంటే.. త‌న జీవితంలో జ‌రిగిన వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రెడ్డి డైరీని రూపొందిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించి మ‌రో సంచ‌ల‌నానికి తెర తీశారు.

శ్రీ‌రెడ్డి స్వీయ చ‌రిత్ర‌ను రెడ్డి డైరీ పేరుతో సినిమా చేయ‌నున్న‌ట్లుగా చెన్నై ప్రెస్ క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు అల్లావుద్దీన్ మాట్లాడుతూ.. శ్రీ‌రెడ్డి జీవితంలో చోటు చేసుకున్న వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రెడ్డి డైరీని రూపొందిస్తామ‌ని చెప్పారు.

ఇదిలా ఉంటే.. ఈ స‌మావేశానికి హాజ‌రైన శ్రీ‌రెడ్డి మాట్లాడుతూ.. త‌న‌ను మోస‌గించిన వారి ఆధారాలు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు వాటిని బ‌య‌ట‌పెడ‌తాన‌ని చెప్పారు. తాను న‌టించ‌బోయే రెడ్డి డైరీ చిత్రానికి స‌హ‌క‌రిస్తామ‌నిన‌డిగ‌ర్ సంఘం హామీ ఇచ్చింద‌న్నారు. క్యాస్టింగ్ కౌచ్ కు సంబంధించిన వీడియో ఆధారాల‌న్ని త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని.. రెడ్డిడైరీ మూవీతో వాటిని విడుద‌ల చేస్తానంటూ మ‌రో బాంబు పేల్చింది శ్రీ‌రెడ్డి.