Begin typing your search above and press return to search.

శ్రీ‌రెడ్డి తాజా టార్గెట్‌.. ఆ యువ హీరో!

By:  Tupaki Desk   |   16 July 2018 8:58 AM GMT
శ్రీ‌రెడ్డి తాజా టార్గెట్‌.. ఆ యువ హీరో!
X
గ‌డిచిన కొద్ది రోజులుగా సినీ న‌టి శ్రీ‌రెడ్డి చేస్తున్న సంచ‌ల‌నాల సంగ‌తి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ కు వ్య‌తిరేకంగా ఆమె గ‌ళం విప్పిన వైనం తెలిసిందే. ప‌వ‌న్ మీద ఆమె చేసిన వ్యాఖ్య‌ల అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో కొంత‌కాలంగా ఆమె కామ్ గా ఉన్నారు. అనంత‌రం ఆమె తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన కొంద‌రితో పాటు.. త‌మిళ సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన కొంద‌రు ప్ర‌ముఖుల‌పై ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుంద‌ర్. సి మీద క్యాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు చేసిన ఆమె.. తాజాగా యువ హీరో సందీప్ కిషన్ మీద ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. టాలీవుడ్ ను వ‌దిలి కోలీవుడ్ మీద గురి పెట్టిన‌ట్లుగా ఉన్న శ్రీ‌రెడ్డి వ్యాఖ్య‌లు చూస్తే.. త‌న‌కు అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని త‌న‌ను వాడుకున్న‌ట్లు ఆమె ఆరోపించారు.

ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సైతం త‌న త‌ర్వాతి సినిమాలో అవ‌కాశం ఇస్తాన‌ని వాడుకున్నార‌న్నామె.. సందీప్ కిష‌న్ మీద ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. సందీప్ లాంటి ద‌రిద్ర‌మైన వ్య‌క్తిత్వం ఉన్న వారు ఈ భూమ్మీద ఉండ‌ర‌ని శ్రీ‌రెడ్డి మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా అత‌ని గురించి రాయ‌లేని భాష‌లో తిట్టేశారు. సందీప్ కిష‌న్ ప్లేబాయ్ అని.. ప్ర‌తి అమ్మాయిని కోరుకుంటాడ‌న్నారు. సినిమాల్లో అవ‌కాశాల కోసం వ‌చ్చే ఏ అమ్మాయిని విడ‌వ‌కుండా వాడుకుంటాడ‌న్న శ్రీ‌రెడ్డి.. అవ‌కాశాల పేరుతో వాడుకున్న అమ్మాయిల లిస్టు పెద్ద‌దేన‌న్నారు.అయితే శ్రీ‌రెడ్డి వ్యాఖ్య‌ల్ని సందీప్ ఖండించారు. శ్రీ‌రెడ్డి జోరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో మ‌రిన్ని సంచ‌ల‌నాల‌కు కేంద్రంగా నిలుస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.