గడ్డం పెంచుకుంటే చేగువేరా కారు: శ్రీరెడ్డి

Fri Jul 20 2018 17:11:25 GMT+0530 (IST)

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం అంటూ కొద్ది రోజుల క్రితం నటి శ్రీరెడ్డి పేరు ఇటు మీడియాలో....అటు సోషల్ మీడియాలో మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని పరిణామాల వల్ల శ్రీరెడ్డి ఇటు మీడియాకు దూరం కాగా....సోషల్ మీడియాలో అపుడపుడు దర్శనమిస్తోంది. తాజాగా తన ఫోకస్ ను శ్రీరెడ్డి....టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు మార్చిన సంగతి తెలిసిందే. అయితే సడెన్ గా మళ్లీ తన దృష్టిని ఓ సెలబ్రిటీపైకి మార్చింది శ్రీరెడ్డి. ఆ పాపులర్ ఫిగర్ ను టార్గెట్ చేస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో శ్రీరెడ్డి సంచలన పోస్ట్ పెట్టింది. పరిటాల రవి బ్రతికి ఉంటే.....ఆ వ్యక్తి సీఎం కాకుండా ఆపేవారని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి పోస్ట్ ...సోషల్ మీడియాలో వైరల్ అయింది.''బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా - ట్రూ హీరోరా పరిటాల రవిగారు. ఆయనే ఉండుంటే.. గడ్డానికి - జుట్టుకి పెయింటింగ్ లు వేసుకునేవాళ్లు సీఎం అవకుండా కాపాడేవారు. గడ్డం పెంచుకుంటే ప్రసంగాల్లో అరుస్తూ డైలాగ్స్ చెప్తే చెగువేరా అవుతారా..... నిద్ర లేవండి గొర్రెల్లారా.. అసలే వర్షాకాలం రా నాయన వానలోకి వెళ్లొద్దని చెప్పండి రంగు పోద్ది.. మీ పులి వేషం వేసుకున్న నక్కకి...# పిచ్చి పీక్స్'' అని శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ స్టార్ హీరో కమ్ పొలిటీషియన్ ను ఉద్దేశించి శ్రీరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిందని ఆయన అభిమానులు ....మండిపడుతున్నారు.