రకుల్ కు క్షమాపణలు చెప్పిన శ్రీరెడ్డి!

Mon Apr 23 2018 13:32:29 GMT+0530 (IST)

టాలీవుడ్ లో క్యాస్టిగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న నటి శ్రీరెడ్డి పలువురిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖ దర్శకుల నుంచి నిర్మాతలు హీరోలపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఇండస్ట్రీలో ఎటువంటి ఇబ్బందులు లేవని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి మండిపడిన విషయం విదితమే.  ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో రకుల్ పై శ్రీరెడ్డి మరో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. రకుల్ ప్రీత్ సింగ్ కు క్షమాపణలు చెబుతూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ రోజు ఓ పోస్ట్ పెట్టింది. దాంతో పాటు పవన్ ఫ్యాన్స్ ను పొగుడుతూ శ్రీరెడ్డి మరో పోస్ట్ పెట్టింది.జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై పెనుదుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా లైవ్ డిబేట్లలో శ్రీరెడ్డి పెద్దగా పాల్గొనడం లేదు. అయితే తన ఫేస్ బుక్ ఖాతాలో ఎప్పటికపుడు తాజా పరిణామాలపై అప్ డేట్స్ ఇస్తోంది. గతంలో రకుల్ పై శ్రీరెడ్డి విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రకుల్ పళ్లు రాలగొడతానని - ముంబైకు తరిమేస్తానని శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ....హఠాత్తుగా రకుల్ కు శ్రీరెడ్డి క్షమాపణలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. ``తన అపాలజీకి రకుల్ అర్హురాలు`` అని శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. అంతేకాకుండా మంచివారైన పవన్ ఫ్యాన్స్ కి అభినందనలు తెలుపుతూ మరో పోస్ట్ పెట్టింది. ‘‘మానవత్వం బతికే ఉంది. ఫ్యామిలీ అంతా దూరమై ఏకాకినైన నాకు - కొంతమంది పీకే ఫ్యాన్స్ తిన్నారా అక్క - బాగున్నావా అని మెసేజ్ చేస్తుంటే కళ్లలో నీళ్లొచ్చాయి. మంచివారైన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి థ్యాంక్స్`` అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.