Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ వ్యాఖ్య‌లపై స్పందించిన‌ శ్రీ‌రెడ్డి!

By:  Tupaki Desk   |   20 April 2018 4:30 PM GMT
ప‌వ‌న్ వ్యాఖ్య‌లపై స్పందించిన‌ శ్రీ‌రెడ్డి!
X
ప‌వ‌న్ పై శ్రీ‌రెడ్డి చేసిన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌పై పెను దుమారం రేగుతోన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ ను తిట్ట‌మ‌ని శ్రీ‌రెడ్డికి తానే స‌ల‌హా ఇచ్చాన‌ని వ‌ర్మ స్వ‌యంగా స్టేట్ మెంట్ ఇవ్వ‌డం....దానిపై ప‌వ‌న్ ఈ రోజు తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ కావ‌డం వంటి ప‌రిణామాల గురించి విదిత‌మే. అయితే, తన‌కు సంబంధించిన అంశంపై ఇంత జ‌రుగుతోన్న‌ప్ప‌టికీ...శ్రీ‌రెడ్డి పెద‌వి విప్ప‌ల‌దు. దాదాపు 20 గంట‌ల నుంచి ఇటు ఫేస్ బుక్ లో కానీ, అటు మీడియా చానెళ్ల‌తో కానీ ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. తాజాగా, శ్రీ‌రెడ్డి త‌న మౌన ముద్రను వీడింది. త‌న ఫేస్ బుక్ ఖాతాలో వ‌రుస పోస్టుల‌తో విరుచుకుప‌డింది. ముందుగా ప‌వ‌న్ అమ్మ గారికి క్ష‌మాప‌ణ‌లు చెబుతూ పోస్ట్ పెట్టింది. ప‌వ‌న్ అమ్మగారికి శిర‌సు వంచి సాష్టాంగ‌ప‌డి ల‌క్ష న‌మ‌స్కారాలు చెబుతున్నా. న‌న్ను క్ష‌మించండి అమ్మా. అమృత మూర్తి మీరు. మీ చెప్పుతో కొట్టండి న‌న్ను. కానీ, మిమ్మ‌ల్ని అంటే గానీ క‌ద‌ల్లేద‌మ్మా ఈ మొండి బ‌ద్ధ‌కంతో ఉన్న సినిమా ఇండ‌స్ట్రీ. మీ ఫొటో చూసి ల‌క్ష సార్లు క్ష‌మించ‌మ‌ని అడిగా. నా విజయం మీకే అంకితం చేస్తా త‌ల్లి`` అంటూ ప‌వ‌న్ త‌ల్లికి శ్రీ‌రెడ్డి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెబుతూ పోస్ట్ చేసింది.

ప‌వ‌న్ పేరెత్త‌కుండా పరోక్షంగా ప‌వ‌న్ వ్యాఖ్య‌లపై శ్రీ‌రెడ్డి స్పందించింది. మెగా ఫ్యామిలీ ఎప్పుడో స్పందించి ఉంటే హుందాగా ఉండేద‌ని...ఇప్ప‌టికీ తాను అల్లు అర్జున్ - రాం చ‌ర‌ణ్ ఫ్యాన్ అని శ్రీ‌రెడ్డి చెప్పింది. ఇన్ని రోజులు ఇండ‌స్ట్రీలోని పెద్ద త‌ల‌కాయ‌ల‌న్నీ ఏమై పోయాయ‌ని - ఇపుడు ఒక్క మాట‌కు బ‌య‌టికొచ్చి వార్నింగులు ఇస్తున్నాయ‌ని చెప్పింది. తాము మీడియా ముందుకు వెళితే త‌ప్ప‌ని - వారు మీడియా ముందుకు వ‌స్తే క‌రెక్టా అని ప్ర‌శ్నించింది. ఆసిఫాకు న్యాయం చేయాల‌ని పోరాడ‌తార‌ని, ఇండ‌స్ట్రీలో బ్ర‌తికున్న మా వ్య‌ధ‌లపై పోరాటం చేయ‌రా అని ప్ర‌శ్నించింది. మీ ఇంట్లో లేడీస్ కి ఉన్న రెస్పెక్ట్... ఇండ‌స్ట్రీలో ఆడ‌వాళ్ల‌కు లేదా అని ప్ర‌శ్నించింది. ``మీ అమ్మ మీకెంతో మా అమ్మ మాకంతే. మా మీద, మా తల్లులను అన్నప్పుడు....రోడ్డు మీదకు వ‌స్తే రేప్ లు చేస్తామ‌ని బెదిరించిన‌ప్పుడు, యాసిడ్ పోస్తామ‌ని బెదిరింపులతో భయపెడుతున్నపుడు మా బాధ అర్థం కాలేదా?’ అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.

‘మీ ఆధిపత్యం సినిమాల్లో చూపించండి. ‘ మా’ఛాంబర్లో చూపించండి. జర్నలిస్టుల మీద బుర‌ద చల్లితే మీ మీదే మరకలు పడతాయి`` అని పోస్ట్ చేసింది. జర్నలిస్టుల జోలికి వస్తే బాగుండదని హెచ్చరించింది. ఈ విజృంభించే ఝాన్సీ ల‌క్ష్మా బాయిని ఆప‌డం ఎవ‌రి వ‌ల్లా కాద‌ని, తన ప్రాణం పోయినా లెక్కచేయబోనని, వీర మరణానికి సిద్ధమని శ్రీ‌రెడ్డి ప్రకటించింది. తన పోరాటం చివరి వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. పోరాటాలు ఎవ‌డి సొత్తూ కాద‌ని చెప్పింది. పోరాటాలు చేస్తున్నట్టు నటించడం తనకు రాదని చెప్పింది. ప్యాకేజీల కోసం పోరాటాలు చేసేది ఎవరో అందరికీ తెలుస‌ని తెలిపింది. నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని, ఒకరోజు హడావుడి చేసి భయపడి తోక ముడిచే పోరాటం కాద‌ని తెలిపింది. పదేళ్ల క్రితం ఒంటరిగా వచ్చాన‌ని, చాలా అనుభవించాన‌ని, ఎవరినీ వదలిపెట్ట‌న‌న‌ని చెప్పింది. దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు, వార్తా చానళ్లకు ఆమె క్షమాపణ చెప్పింది. వ‌ర్మ కృష్ణావ‌తారం ఆపాల‌ని....తాను స‌త్య‌భామ అవ‌తార‌మెత్తాన‌ని...ఇక‌పై త‌న త‌డాఖా చూపిస్తాన‌ని శ్రీ‌రెడ్డి తెలిపింది.