Begin typing your search above and press return to search.

మర్యాదగా మాట్లాడు మంచు లక్ష్మి

By:  Tupaki Desk   |   22 July 2018 9:31 AM GMT
మర్యాదగా మాట్లాడు మంచు లక్ష్మి
X
ఎన్నైనా చెప్పండి.. నోరుండే వాడిదే ఈ లోకం.. ఎవరినైనా తిట్టొచ్చు. ఇది న్యాయమా అని అమాయకంగా ప్రశ్నిస్తే రాజ్యాంగం దగ్గరి నుండి రాజుగారి గది సినిమాలో మ్యాజిక్కుల దాకా తలా తోకాలేని చిత్ర విచిత్ర వితండ వాదనలతో నేను రైటు 'మీరంతా రాంగు'.. అని ప్రశ్నలు అడిగిన వాడినే ఒప్పుకునేలా చెయ్యొచ్చు. దీనికి ప్రత్యేకంగా ఉదాహరణలు ఇవ్వాల్సిన అవసరం లేదని మెరుగైన సమాజంలో ఉంటున్న మీకు చెప్పనవసరం లేదు కదా?

ఆదివారం పొద్దున్నే ఎంటా ఈ గోల అనుకోవద్దు. ఎందుకంటే మీరు అలా ఆనుకున్నా అనుకోక పోయినా తెలుగు నటీమణి శ్రీరెడ్డి మాత్రం అనుకోదు. ఆమెకి ఈమధ్య కోపం వచ్చింది. ఇప్పుడేంటి... ఎప్పుడూ ఆమెకి ఎవరో ఒకరిపైన కోపం వస్తూనే ఉంటుంది కదా.. కానీ ఈసారి మంచువారి ఆడపడుచైన మంచు లక్ష్మిపై వచ్చింది. మంచు లక్ష్మీ ఈమధ్య హాట్ హాట్ గా నడుస్తున్న కాంట్రవర్షియల్ టాపిక్ 'క్యాస్టింగ్ కౌచ్' పై తన అభిప్రాయలను వెలిబుచ్చింది. నాన్నగారైన మోహన్ బాబులానే లక్ష్మి కూడా ఫైర్ బ్రాండ్.. ఓపెన్ గానే మాట్లాడుతుంది. ఆమె అడిగిన ఒక ఘాటైన ప్రశ్న ఏంటంటే 'అసలు ఒక అమ్మాయి ఆ రేంజ్ కి ఎందుకు దిగజారాలి?" అంతే కాకుండా ఒకవేళ అన్యాయం జరిగితే సంబంధిత ఎజన్సీలను - సంఘాలను ఆశ్రయించవచ్చు కదా అంది.. దీంతో శ్రీ రెడ్డి కి చిర్రెత్తుకొచ్చి మంచు లేడిపై విమర్శల బాణాలను సంధించింది.

మంచు లక్ష్మి ఇంట్లో జరిగే ప్రైవేటు పార్టీలకు తనకు కొన్నిసార్లు ఇన్విటేషన్లు వచ్చాయని.. "ఏ రోజూ అక్కడ డ్రగ్స్ తీసుకునేవాళ్ళు లేరా.. మీకు ఆ సంగతి తెలీదా?" అంటూ ప్రశ్నించింది. ఒక పెద్ద నటుడి కూతురుగా మంచు లక్ష్మికి తమలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారి పడే బాధ తెలియక పోవచ్చని అంత మాత్రాన 'అడ్డదారిలో వెళ్ళాననడం'.. 'దిగజారుడు' లాంటి పదాలను వాడడం సరికాదని.. మొదట మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండని చెప్పింది. పిచ్చి పిచ్చిగా ఇష్టానికి మాట్లాడితే ఇక్కడ పడేవాళ్ళెవరూ లేరంది. అసలు నార్త్ ఇండియన్ అమ్మయిలను తెసుకొచ్చి మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి మరీ హీరోయిన్ ఛాన్సులు ఇప్పిస్తున్నదే మీరే అని... ముందు తెలుగు వాళ్ళను ఎంకరేజ్ చేయడం నేర్చుకోండని చెప్పింది. ఏజేన్సీలు.. అసోసియేషన్లని పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అసలు మీ 'మా' లోనే పెద్ద పింప్ లు ఉన్నారు.. ఆ విషయం ముందు తెలుసుకోండి అని ఘాటుగా చెప్పింది.