Begin typing your search above and press return to search.

శ్రీరెడ్డి హ్యాండ్‌ బ్యాగ్‌ లో పెద్ద బాంబ్‌..!

By:  Tupaki Desk   |   20 Nov 2018 4:59 PM GMT
శ్రీరెడ్డి హ్యాండ్‌ బ్యాగ్‌ లో పెద్ద బాంబ్‌..!
X
తెలుగు సినిమా పరిశ్రమను ఒక కుదుపు కుదిపి తమిళ సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకుని చెన్నైలో మెల్లగా సెటిల్‌ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న శ్రీరెడ్డి అక్కడ కూడా సంచలనాలకు కేంద్ర బింధువుగా ఉంటూ వస్తోంది. తాజాగా శ్రీరెడ్డి ఒక తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక బాంబు పేల్చింది. తన హ్యాండ్‌ బ్యాగ్‌ లో ప్రముఖులు భయపడే ఒక బాంబు ఉందని ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో చెప్పింది. తన హ్యాండ్‌ బ్యాక్‌ లో సాదారణ వస్తువులతో పాటు కొందరు సినీ ప్రముఖులకు సంబంధించిన రహస్యాలు కూడా ఉంటాయని పేర్కొంది.

నా హ్యాండ్‌ బ్యాగ్‌ చూడాలి అంటే 18 ఏళ్లు మీకు నిండి ఉండాలని చెప్పుకొచ్చింది. నా హ్యాండ్‌ బ్యాగ్‌ లో.. ఫోన్‌ - సన్‌ స్కిన్‌ లోషన్‌ - మొబైల్‌ చార్జర్‌ - సన్‌ గ్లాసస్‌ - ఓడోమస్‌ - వాచ్‌ - ఇయర్‌ ఫోన్స్‌ - దుర్గామాత కుంకుమ - ఒక దేవుడి లాకెట్‌ - మేకప్‌ కిట్‌ - ఇంటి తాళాలు - కారు తాళాలు ఇంకా ఒక పెన్‌ డ్రైవ్‌ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆ పెన్‌ డ్రైవ్‌ లో పెద్ద పెద్ద ప్రముఖుల జీవితాలు ఉన్నాయంటూ బాంబు పేల్చింది. నాతో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే పెన్‌ డ్రైవ్‌ లోకి ఎక్కుతారు. నీవు ఇప్పుడు నాతో అసభ్యంగా ప్రవర్తించినా కూడా నీ నా పెన్‌ డ్రైవ్‌ లో చేరతావని సదరు ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో అనడంతో ఆయన షాక్‌ అయ్యాడు. పెన్‌ డ్రైవ్‌ లో ఉన్న ఆ ప్రముఖులు ఎవరో చెప్తారా అంటే ఇప్పుడు తాను ఏం చెప్పలేను అంటూ మాట దాటేసింది. ఈ ఇంటర్వ్యూలో ఇంకా పలు ఆసక్తికర విషయాలను శ్రీరెడ్డి షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో శ్రీరెడ్డి ఇంటర్వ్యూ వైరల్‌ అయ్యింది.