మా గురించి కూడా ఆలోచించండి పవన్ గారు

Tue Mar 13 2018 22:02:10 GMT+0530 (IST)

ఛాన్స్ కోసం తాపత్రాయపడే నటీమణుల్లో ఓపిక ఎంత వరకు ఉంటే అవకాశం వస్తుందో తెలియదు కానీ.. అదే ఓపిక లిమిట్స్ దాటితే ఈ రోజుల్లో యుట్యూబ్ లో  వైరల్ అవ్వడం కామన్. మనసులో అనుకున్నది పబ్లిక్ మీడియా ముందుకు వచ్చి ఓ రేంజ్ లో చెప్పేస్తున్నారు. రీసెంట్ గా ఓ నటి కూడా అందరు అవక్కయ్యేలా తన ఆవేదనను చెప్పేసింది. ప్రస్తుతం ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.ఎందుకంటే ఆమె కూడా స్పెషల్ గా పవన్ కళ్యాణ్ పై మాట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఏ ఫిలిం బై అరవింద్ 2 సినిమాలో కనిపించిన నటి శ్రీలేఖ ఎలియాస్ శ్రీ రెడ్డి మల్లిడి తెలుగు ఇండస్ట్రీ గురించి ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసింది. శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. ''తెలుగు ఇండస్ట్రీలో పక్కలో పడుకోకపోతే ఛాన్సులు రావు. క్యాస్టింగ్ కౌచ్ గట్టిగానే ఉంది. దర్శకుడు నిర్మాత ఆ తరువాత కెమెరామెన్ వరకు లిస్ట్ ఉంటుంది. తెలుగు అమ్మాయిలంటే చాలు ఎందుకో చులకన. మేము అందంగా లేమా వర్కౌట్స్ చేయడం లేదా. పెద్ద పెద్ద స్టార్స్ తెలుగమ్మాయిలతో సినిమా చేయడానికి ఇష్టమే అంటారు కానీ అన్ని వట్టి మాటలే'' అంటోంది ఆమె.

ఇక పవన్ గురించి ప్రస్తావిస్తూ.. ''పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో తెలుగు భాష అంటే చాలా ఇష్టపడి ప్రసంగాలు ఇస్తారు కదా. ఒక తెలుగమ్మాయిని హీరోయిన్ గా అలాగే తెలుగు విలన్ ని సినిమాలో ఎందుకు తీలుకోరు. సమంత ప్రణీత లాంటి వారే కావాలా. మాకు కూడా అవకాశం ఇవ్వచ్చుగా. మీరు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. మా గురించి కూడా ఆలోచించండి అంటూ శ్రీ మాట్లాడింది. ఇక పవన్ ఫ్యాన్స్ గురించి కూడా ఒక వివరణ ఇస్తూ.. నేను పవన్ కళ్యాణ్ గారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఆయాన పొలిటికల్ లైఫ్ గురించి కూడా కామెంట్ చేయను. కత్తి మహేష్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫెస్ చేశారో నాకు తెలుసు. నేను ఎదుర్కోవడానికి సిద్ధమే. తెలుగు భాష పై గౌరవం ఉన్న వారు తెలుగు అమ్మాయిలకు కూడా అండగా ఉండండి. స్పెషల్ స్టేటస్ గురించి పొట్లాడుతున్న పవన్ గారు మా ఆవేదన విని సహాయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను'' అని శ్రీ రెడ్డి తెలిపింది.

ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దాదాపు సినిమలకు దూరంగా ఉన్నాడు. కేవలం రాజకీయాలకు సంబంధించిన విషయాలపైనే దృష్టి పెట్టారు. మరి ఇలాంటి టైమ్ లో శ్రీ చేసే వ్యాఖ్యలు ఆయన వరకు చేరతాయా? ఒకవేల ఆయన స్పందించినా కూడా ఎలాంటి లాభం ఉంటుంది అనేది ఇప్పుడున్న ప్రశ్న.