ఎన్నో రేపుల తర్వాతే ఒక సినిమా పూర్తి!

Sun Apr 15 2018 11:32:05 GMT+0530 (IST)

తన మాటలతో టాలీవుడ్ ను షేక్ చేస్తున్న సినీ నటి శ్రీరెడ్డి మరోసారి తన మార్క్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్  కౌచ్ పై ఓపెన్ అయిన ఆమె పుణ్యమా అని మిగిలిన వుడ్ లతో పోలిస్తే.. టాలీవుడ్ లోనే ఈ అంశంపై భారీ చర్చ జరగటమేకాదు.. రోజుకో కొత్త పేరు వస్తోంది. అంతేకాదు.. క్యాస్టింగ్  కౌచ్ కు బాధితులమంటూ చాలామంది బయటకు వస్తున్నారు.క్యాస్టింగ్  కౌచ్ తో పాటు.. మా సభ్యత్వం కోసం పోరాడుతున్న శ్రీరెడ్డి తాజాగా ఉస్మానియా వర్సిటీకి వెళ్లారు. ఈ మధ్యన ఆమెను వర్సిటీకి ఆహ్వానించిన విద్యార్థి సంఘాలు ఆమెకు తమ మద్దతును ప్రకటించాయి. ఇదిలా ఉంటే తాజాగా శ్రీరెడ్డిని ఏఐఎస్ఎఫ్ ఓయూ కౌన్సిల్ విశ్వవిద్యాలయానికి ఆహ్వానించారు. ఆమె పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. తాను సినిమాల్లో అవకాశాల కోసం పోరాటం చేయటం లేదని స్పష్టం చేశారు. ఆడవాళ్లకు న్యాయం జరగాలన్నదే తన అభిమతమన్న ఆమె.. మా లో చాలా లోపాలు ఉన్నాయరన్నారు. ఓయూ విద్యార్థులు తనకు అండగా నిలవటంతో మా వెనక్కి తగ్గిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో రేపులు జరిగితేనే ఒక సినిమా పూర్తి అవుతుందన్న వివాదాస్పద వ్యాఖ్యను చేశారు శ్రీరెడ్డి. తాను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని.. తనపై విష ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. గన్ లో బుల్లెట్లు సిద్ధంగా ఉన్నాయని.. ఎప్పు్డైనా.. ఎక్కడైనా.. ఎవరి మీదనైనా పేలొచ్చు అన్న ఆమె.. ఇప్పుడే కాకున్నా పదేళ్ల తర్వాత అయినా తాను పేలుస్తానని వ్యాఖ్యానించారు. మరి.. శ్రీరెడ్డి గన్ లో బుల్లెట్లు ఎప్పుడు పేలతాయో చూడాలి.