Begin typing your search above and press return to search.

శ్రీరెడ్డి తో ఉన్న సదరు హీరోఎవరు?

By:  Tupaki Desk   |   16 March 2018 4:15 PM GMT
శ్రీరెడ్డి తో ఉన్న సదరు హీరోఎవరు?
X
టాలీవుడ్ లో ఈ మధ్య సమస్యలు చాలా ఎక్కువవుతున్నాయి. చిన్న విషయం జరిగినా మీడియా దాన్ని మరింత హైలెట్ చేస్తూ.. లేనిపోని వివాదలకు దారి తీస్తోంది. ప్రస్తుతం ఆలేఖ్య అలియాస్ శ్రీ రెడ్డి అనే తెలుగు నటి తెలుగమ్మాయిలకు ఆఫర్స్ ఇవ్వడం లేదంటు కొన్ని వివాదాస్పద వ్యాక్యాలు చేశారు. అలాగే దర్శక నిర్మాతలు బెడ్ షేర్ చేసుకోవడం తప్ప ఛాన్సులు ఇవ్వడం లేదని ఘాటైన కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం ఆ విషయానికి సంబంధించిన న్యూస్ సోషల్ మిసియాల్లో ట్రెండ్ అవుతోంది. అయితే రీసెంట్ గా ఓ మీడియా ఛానెల్ వారు స్ట్రింగ్ ఆపరేషన్ అని ఓ కో ఆర్డినేటర్ బూతు పురాణాలను బయటపెట్టారు. ఆ విషయం గురించి మాట్లాడిన తరువాత శ్రీ రెడ్డి ఒక హీరోతో సన్నిహితంగా ఉన్న ఫోటోని బయటపెట్టారు. లైవ్ లోనే మొబైల్ లో చూపించడంతో ఆ ఫొటోలో ఉన్న హీరో కుంచెం గెడ్డం లుక్ తో ఉన్నాడు. శ్రీ రెడ్డి తో సన్నిహితంగా ఉండి ఆఫర్స్ ఇప్పిస్తాను అని చెప్పాడట. కానీ ఫైనల్ గా అతని వల్ల ఎలాంటి లాభం చేకూరలేదని శ్రీ రెడ్డి వివరించింది.

అయితే ఆ ఫొటోలో ఉన్న స్టార్ హీరో ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరో పలానా అని కొంత మంది హీరోల పేర్లు సోషల్ మీడీయాలో పోస్ట్ చేస్తున్నారు. చాలా వరకు ఓ హీరో వైపు ఎక్కువ వేళ్లు మల్లుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చాలా మంది హీరోలు అలాంటి స్టైల్ ని మెయింటెన్ చేస్తున్నారు. మరి మంచి హీరోలను కూడా అనుమానిస్తే తప్పవుతుంది. మరి శ్రీ రెడ్డితో జాతకట్టిన ఆ సరసాలు కథనాయకుడు ఎవరో తెలియాలంటే వారే బయటపెట్టాలి.