Begin typing your search above and press return to search.

హీరోలకూ పరీక్షే.. దర్శకుడికీ పరీక్షే

By:  Tupaki Desk   |   26 Sep 2018 8:53 AM GMT
హీరోలకూ పరీక్షే.. దర్శకుడికీ పరీక్షే
X
తెలుగులో చాన్నాళ్ల తర్వాత ఒక పెద్ద స్థాయి సినిమా వస్తోంది. సీనియర్ హీరో అక్కినేని నాగార్జున.. యువ కథానాయకుడు నానిల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘దేవదాస్’ గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగ్-నానిల కాంబినేషనే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. ఐతే ఈ ఇద్దరు హీరోలకూ ఇప్పుడు హిట్ చాలా అవసరం. వీరి గత సినిమాలు చేదు అనుభవాలు మిగిల్చాయి.

ముఖ్యంగా నాగార్జున రెండేళ్లుగా బాగా స్ట్రగులవుతున్నాడు. గత ఏడాది ఆరంభంలో ‘ఓం నమో వేంకటేశాయ’ ఆయనకు పెద్ద షాకే ఇచ్చింది. ఆ తర్వాత నాగ్ ప్రత్యేక పాత్రలో నటించిన ‘రాజు గారి గది-2’ కూడా నిరాశనే మిగిల్చింది. ఇక ఈ ఏడాది వచ్చిన ‘ఆఫీసర్’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరోవైపు నాని విన్నింగ్ స్ట్రీక్ కి ‘కృష్ణార్జున యుద్ధం’ పెద్ద బ్రేక్ వేసింది. ఆ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో హీరోలిద్దరికీ ‘దేవదాస్’ హిట్టవడం చాలా అవసరం.

మరోవైపు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు కూడా ‘దేవదాస్’ పరీక్షగా నిలవబోతోంది. ఇంతకుముందు అతను తీసిన ‘భలే మంచి రోజు’.. ‘శమంతక మణి’ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి కానీ... కమర్షియల్ సక్సెస్ కాలేదు. కేవలం టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకుంటే నడవదిక్కడ. కమర్షియల్ సక్సెస్ చాలా ముఖ్యం. ఆ లోటును ‘దేవదాస్’ తీరుస్తుందని అతను ఆశపడుతున్నాడు. ఈ సినిమాకు అనుకున్నదాని కంటే బజ్ బాగానే వచ్చింది. బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఓపెనింగ్స్ బాగానే వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కావాల్సిందల్లా పాజిటివ్ టాకే. అది వస్తే ముగ్గురి ఖాతాలోనూ అత్యావశక్యమైన విజయం జమ అయ్యే అవకాశముంది.